రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్

434

దేశ రాజ‌కీయాలు మ‌రింత ర‌క్తిక‌ట్టిస్తున్నాయి.. ఇప్పుడు ఎన్డీయేకు ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రో పోరుకు స‌మ‌యం వ‌చ్చింది. ఎన్టీయే కూట‌మి పార్టీలు ఏవి వెనుక ఉండి ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీలు ఏవి అనేవి ఇక తేలిపోనున్నాయి ఈ ఎన్నిక‌లతో…. రాజ్యసభ ఉపసభాపతి పోరు పై దేశంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌జ‌రుగుతోంది.. నిజానికి బీజేపీకి కాంగ్రెస్ కు మ‌ధ్య మ‌రింత చ‌ర్చ న‌డుస్తోంది.ఆగష్టు 9న ఉదయం 11 గంటలకు రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగునున్నాయి.ఈ విష‌యాన్ని సభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

ఇక ఈ స‌మ‌యంలో బీజేపీ మిత్ర‌ప‌క్షం శిరోమ‌ణీ అకాలీద‌ళ్ రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.శిరోమణి అకాలీదళ్ పార్టీకి రాజ్యసభలో ముగ్గురు సభ్యుల బలం ఉంది. ఇందులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ రేసులో ఉన్న నరేష్ గుజ్రాల్ కూడా ఉన్నారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం తక్కువగా ఉంది.

Image result for modi sad face

రాజ్యసభ ఉపసభాపతి పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో ఎన్డీఏ అభ్యర్థిని రంగంలోకి దించి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని కమలదళం పెద్దలు పావులు కదుపుతున్నారు. సభలో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్డీఏ తరపున మిత్రపక్షానికి చెందిన శిరోమణి అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్ కానీ జేడీయూకి చెందిన హరివంశ్‌ను నిలబెడితే ఇతర పార్టీల మద్దతు కూడా ఉంటుందనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది.

Image result for venkaiah naidu

ఇదిలా ఉంటే రాజ్యసభ ఉపసభాపతి రేసులో జేడీయూ అభ్యర్థి హరివంశ్‌ను నిలబెడుతున్నామని ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు. అయితే తమ పార్టీలో చర్చించుకున్న తర్వాతే చెబుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.మొత్తానికి ఇప్పుడు ఈ ఎన్నిక‌ల్లో ఎన్టీయే కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాలు స్వ‌ప‌క్షాలు పార్టీల విప‌క్షాలు ఎవ‌రిని ఎన్నుకుంటాయి అనేది ఓ ఆలోచ‌న‌గా ఉంది.