అమ్మని శశికళ ఎంత దారుణంగా హింసించిందో చూస్తే రక్తం మరిగిపోతుంది

525

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల ఇల‌వేల్పు మాజీ సీఎం దివంగ‌త జ‌య మ‌ర‌ణం వెనుక ఆస‌క్తిక‌ర విష‌యాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆమె మ‌ర‌ణంలో త‌మిళ ప్ర‌జ‌లు షాక్ కి గురి అయ్యారు ఆమె బ్ర‌తికి ఉన్న స‌మ‌యంలో ఎటువంటి రాజ‌కీయ విభేదాలు క‌నిపించ‌లేదు, కాని ఆమె మ‌ర‌ణించిన త‌ర్వాత అనేక వివాదాలు విభేదాలు ఆమె పార్టీలోవ‌చ్చాయి. ఇక ఆమె మ‌ర‌ణం పై కూడా ఇప్ప‌టికీ ఓ అనుమానం అనే చెబుతారు అక్క‌డ ప్ర‌జ‌లు.. జ‌య మర‌ణం అనారోగ్యంతో కాద‌ని, దాని వెనుక అనేక కార‌ణాలున్నాయ‌ని ఆమె ఆస్ప‌త్రి పాలైన‌ప్ప‌టి నుంచి అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే, అక్క‌డి ప్ర‌భుత్వంపైనా, అన్నాడీఎంకే పార్టీపైనా జ‌య నెచ్చ‌లి శ‌శిక‌ళకు ఉన్న ప‌ట్టుతో ఆ అనుమానాల‌కు మొన్న‌టి వ‌ర‌కూ ప్రాధాన్య‌త లేకుండా పోయింది. అయితే, శ‌శిక‌ళ జైలు పాలైన త‌ర్వాత జ‌య మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేసేవారి సంఖ్య కూడా పెరింగింది. దాంతో జ‌య మ‌ర‌ణం ర‌హ‌స్యాల‌ను నిగ్గు తేల్చేందుకు, అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు విచార‌ణ క‌మిష‌న్ ఏర్పాటైంది. ఆ విచారణ క‌మిష‌న్ ఎదుట హాజ‌ర‌వుతున్న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు జ‌య మ‌ర‌ణంపై ఉన్న అనుమానాల‌ను నివృత్తి చేయ‌కుండా మ‌రింత పెంచుతున్నాయి.

Image result for sheshikala
ఈ క్ర‌మంలోనే అమ్మ జ‌య‌కు చికిత్స అందించిన అపోలో ఆస్ప‌త్రిపైనా అనేక ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జ‌య‌కు చికిత్స అందించిన వైద్య బృందానికి నేతృత్వం వ‌హించిన డాక్ట‌ర్ మాథ్యూ శ్యామ్యూల్ ఇచ్చిన వాంగ్మూలం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. జ‌య మ‌ర‌ణం వెనుక నిగూఢ‌త‌ను వెల్ల‌డించేలా ఆయ‌న సాక్ష్యం ఉండ‌డం క‌ల‌క‌లం రేపింది. దివంగ‌త‌ జయలలితకు యాంజియోగ్రామ్‌ అక్కర్లేదని డాక్టర్‌ మాథ్యూ శామ్యూల్‌ కలరిక్కల్‌ సలహా ఇచ్చిన విషయం బయటకొచ్చింది. ఈ అంశంపై ఆయన జస్టిస్‌ ఆర్ముగసామి కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు. ‘యాంజియోప్లాస్టీ పితామహుడు’గా డాక్టర్‌ శామ్యూల్‌కు పేరుంది. జయలలితకు సరైన చికిత్స అందించకుండా అపోలో ఆస్పత్రితో శశికళ కుమ్మక్కయ్యారని తమిళనాడు ప్రభుత్వంతోపాటు జస్టిస్‌ ఆర్ముగసా మి కమిషన్‌ లాయర్‌ ఇటీవలే ఆరోపించారు.

Related image

ఆ వేడి చల్లారక ముందే డాక్టర్‌ మాథ్యూ వాంగ్మూలం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. 2018 నవంబరు 20న ఈ వాంగ్మూలం ఇచ్చారు. జయ మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆయన చెప్పిన కీలక అభిప్రాయాలు అందులో ఉన్నాయి. అంతేకాదు.. ఆస్పత్రిలో ఉండగా డాక్టర్‌ మాథ్యూని చూడటానికి జయలలిత నిరాకరించారు…2016 అక్టోబరు 25న నేను అపోలో ఆస్పత్రిలోని జయలలిత గది దగ్గరకు వెళ్లాను. అప్పుడు ఉదయం 8.45 గంటలైంది. జయ బాత్రూమ్‌కు వెళ్లారు. ఆ రోజు నన్ను చూడాలనుకొవడం లేదని జయ బదులిచ్చారు. తర్వాతి రోజు నేను వేరే ఊరు వెళ్లాను. జయకు యాంజియోగ్రామ్‌ అవసరమో లేదో సలహా అడగడానికి నన్ను పిలిచారు’ అని మాథ్యూ చెప్పారు. యాంజియో ఎందుకు అవసరం లేదో కేస్‌ షీట్‌లో రాసినట్లు ఆయన తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

‘నేను ఆమె గదికి వెళ్లడానికి ముందు జయలలిత కేస్‌ షీట్‌ చూశాను. యాంజియోగ్రామ్‌ అక్కర్లేదని మెడికల్‌ నోట్‌ కాలమ్‌లో రాశాను. ఈసీజీ, ఎకో, డీఐఐ చేయొచ్చని చెప్పాను’ అని మాథ్యూ పేర్కొన్నారు. జయలలిత గుండెలో ద్వికపర్ది కవాటము(మిట్రల్‌ వాల్వ్‌) పెరగడం కూడా యాంజియో వద్దనడానికి ఒక కారణంగా తెలిపారు. 2015 నుంచే ఆమె గుండెలో మిట్రల్‌ వాల్వ్‌ 14 మిల్లీమీటర్లు పెరిగింది. ఈ విషయం తనకు తెలుసని మాథ్యూ చెప్పారు. అంటే జ‌య‌కు అవ‌స‌రం లేని వైద్యాన్ని అపోలోలో అందించిన‌ట్లు దీనిని బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. జ‌య‌పై కుట్ర‌లు చేసిన వారి ప్ర‌భావానికి లోనైన అపోలో యాజ‌మాన్యం ఆమెకు అవ‌స‌రం లేని చికిత్స అందించిందా అన్న అనుమానాలు ఈ డాక్ట‌ర్ ప్ర‌క‌ట‌న‌తో బ‌ల‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై ఎటువంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయో చూడాలి.