జగన్ సంచలనం… ఏపీ సీఎస్ గా మహిళా అధికారి ఆమె బ్యాగ్రౌండ్ ఇదే

473

ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆయన తన నిర్ణయాలతో ప్రజా సంక్షేమ పథకాలతో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.సీఎంగా పదవి చేపట్టిన వెంటనే తన కేబినెట్ లో ఏకంగా ముగ్గురు మహిళలకు చోటిచ్చిన జగన్… వారిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు… మరో మహిళకు ఏకంగా రాష్ట్ర హోం మంత్రి పదవిని ఇచ్చేశారు. ఈసమయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రథాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అయిన మహిళా అధికారి నీలం సహానీని ఎంపిక చేశారు. ప్రస్తుత సీఎం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్ స్థానం నుంచి బదిలీ చేసిన జగన్ సర్కారు… ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సహానీకి కబురు పెట్టడమే కాకుండా ఉన్నపళంగా అమరావతికి రప్పించింది.

Image result for నీలం సహానీ

ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండైన నీలం సహానీ… నేరుగా జగన్ నివాసానికి చేరుకున్నారు. నీలం సహానీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు జగన్… సోమవారం మధ్యాహ్నం తన ఇంటిలోనే విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వ ప్రయారిటీలను వివరించిన జగన్… సంక్షేమ పాలనకు మద్దతుగా నిలవడంతో పాటుగా తాము ప్రారంభించిన సంక్షేమ పాలనకు మరిన్ని మెరుగులు దిద్దాలని కోరారు. జగన్ ఆత్మీయ విందు మహిళలకు జగన్ పాలనలో దక్కుతున్న ప్రాధాన్యంపై హర్షం వ్యక్తం చేశారు నీలం సహానీ… రాష్ట్రంలో సంక్షేమ పాలనకు గట్టి పునాదులు పడేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారట. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న నీలం సహానీ…. ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారే. కేంద్రంలో సామాజిక న్యాయం సాధికారత శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు నీలం సహానీ…. గతంలో ఆమె ఉమ్మడి రాష్ట్రంలోనూ పలు కీలక పదవుల్లో పని చేశారు. ఏపీ తెలంగాణలో పలు శాఖల్లో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.

ఈ క్రింద వీడియో చూడండి

ఎల్వీని సీఎస్ పదవి నుంచి బదిలీ చేయడానికి రంగం సిద్ధమైన వెంటనే జగన్ సర్కారు… నీలం సహానీ కెరీర్ ను పూర్తి స్థాయిలో పరిశీలించింది. తనకు అప్పజెప్పిన ఏ పనిని అయినా సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఏమాత్రం అలసత్వం వహించని అధికారిగా నీలంకు పేరుంది. ఇదే విషయాన్ని పసిగట్టిన జగన్… ఎల్వీ స్థానంలో ఏపీకి నూతన సీఎస్ గా నీలం అయితేనే మంచిదని అంతేకాకుండా మహిళలకు మరింత ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లు అవుతుందని నీలం సహానీనే సీఎస్ గా ఎంపిక చేశారు. తన కేబినెట్ లో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులతో పాటు ఓ డిప్యూటీ సీఎం పోస్టు హోం శాఖ సహా కీలక శాఖలు అప్పగించిన జగన్… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా మహిళా అధికారికి కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరి జగన్ తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

ఈ క్రింద వీడియో చూడండి