కోడెల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడ్డ సంచలన నిజాలు

2042

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణం వెనక రాజకీయ కక్షలు ఉన్నాయన్నది టీడీపీ వర్గాల వాదన. మానసిక వేదన భరించలేక ఆయన సూసైడ్ చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెల ఆత్మహత్యపై టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. ఇంతకీ కోడెలది ఎలాంటి మరణం అన్నది పోలీసులు ఇవాళ స్పష్టం చేయనున్నారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం… కోడెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇంట్లో టిఫిన్ చేసి 10.10కి బెడ్‌రూంకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఆ సమయంలో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు సహా ఏడుగురు ఉన్నారు. 10.40కి ఆయన్ని బసవతారకం కాన్సర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పల్స్ పడిపోయినా డాక్టర్లు మరో 40 నిమిషాలపాటూ బతికించేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రింద వీడియో చూడండి

కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్యేనని ఉస్మానియా వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. పోస్టుమార్టం నివేదిక హైదరాబాద్ పోలీసులకు అందించింది. ఆయనది ఆత్మహత్యేనని ఉరివేసుకొని చనిపోయినట్లుగా ఆధారాలు లభించాయని నివేదికలో డాక్టర్లు పేర్కొన్నారు. మెడ భాగంలో 8 ఇంచుల మేర తాడు బిగించుకున్న ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నారు. కోడెల చివరగా టిఫిన్, కాఫీ తీసుకున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత కొన్ని శాంపిల్స్‌ని సేకరించి FSLకి పంపించారు. కోడెల శివప్రసాద్ మృతేదేహానికి నలుగురు డాక్టర్ల బృందం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించింది. దాదాపు 2 గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు. మృతదేహం పాడవకుండా ఉండేందుకు ఎంబామింగ్ చేసి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి కోడెల పార్థివదేహాన్ని నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌కు తీసుకెళ్లారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సందర్శనార్థం మంగళవారం ఉదయం వరకు ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్లోనే ఉంచుతారు.

Image result for kodela siva prasad dead body

ఈరోజు మధ్యాహ్నం లోపు కోడెల కొడుకు కోడెల శివరాం కెన్యా నుంచి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత కోడెల మృతదేహాన్ని నరసారావు పేటకు తరలిస్తారు. అయితే నరసారావు పేటలో 144 సెక్షన్ అమలులో ఉంది. కోడెల మృతితో శాంతిభద్రతల దృష్ట్యా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆంక్షలు విధించినట్టు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి సోమ‌వారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కోడెల మృతితో నియోజకవర్గంలో అల్లర్లు జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు హై అలర్డ్ ప్రకటించారు. ఇప్ప‌టికే కోడెల మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నరసరావుపేట, చుట్టు పక్కల గ్రామాల్లో భారీ అనుచర గణం ఉంది. వారంతా తమ ప్రియతమ నేత మృతిని జీర్ణించులేకపోతున్నారు. నరసరావుపేటలో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. అయితే ఇప్పటికే కోట సెంటర్‌లోని ఆయన ఇంటికి అనుచరులు, అభిమానులు భారీగా తరలివస్తుండ‌టం. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం నిషేధాజ్ఞ‌లు అమలు చేస్తున్న‌ట్టు పోలీసు వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక కోడెల మృతి మీద వైసిపి టీడీపీ రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కోడెల మరణంపై రాజకీయాలు చేయొద్దనీ, తమను మరింత కుంగదీయొద్దనీ వేడుకుంటూ కన్నీటి సంద్రమయ్యారు. మరి కోడెల పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.