వైఎస్ వివేకానంద రెడ్డి మరణం పై బయటపడ్డ సంచలన నిజాలు.. శరీరంపై ఏముందో చూసి షాకైన కుటుంబ సభ్యులు..

437

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున పులివెందులలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. గుండెపోటుతో బాత్‌రూమ్‌లో మృతిచెంది ఉండగా ఆయనను కుటుంబసభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. పులివెందులలోని తన స్వగృహంలోనే కన్నుమూశారు. వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్య, ఒక కుమార్తె ఉన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కడప, పులివెందులపై తనదైన ముద్ర వేశారు.1950, ఆగస్టు 8న జన్మించిన వైఎస్ వివేకానందరెడ్డి.. వైఎస్ కుటుంబంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత రాజకీయాల్లో రాణించిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. పులివెందుల నుంచి 1989, 1994లో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వైఎస్ వివేకా… 1999, 2004లో కడప ఎంపీగా గెలుపొందారు.

Image result for ys vivekananda reddy dead body

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగిన వైఎస్ వివేకానందరెడ్డి కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయశాఖమంత్రిగా కూడా పని చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. కొంతకాలం క్రితం జరిగిన కడప జిల్లా స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు వైసీపీ వ్యవహారాలను చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి కొద్ది రోజులుగా లోటస్‌పాండ్‌లోనే ఉంటూ పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. గురువారం పులివెందులలో వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు వైఎస్ వివేకా. పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను తనపై వేసుకుని ప్రచారం చేపడుతున్న వివేకానందరెడ్డి హఠాన్మరణంతో వైసీపీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే వివేకానందది హత్య అని ప్రాథమిక నిర్దారణలో తేలింది. మొత్తం ఏడుచోట్ల గాయాలు ఉన్నాయి.పదునైన ఆయుధంతో తల శరీరం మీద ఏడుసార్లు గాయం చేసినట్టు సమాచారం. తొడభాగంలో ఒక గాయం చేతిపైన మరొక గాయం తలా వెనుక భాగంలో మరొక గాయం ఉంది. నుదుటి మీద రెండు గాయాలు.. ఇలా మొత్తం ఏడూ చోట్ల గాయాలు ఉన్నాయి. ఆయన శరీరం మీద గాయాలు ఉండటం చూసి షాక్ అవుతున్నారు అందరు. ఈ గాయాలను బట్టే అతనిది హత్య అని అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం లో హత్యే అని తేలింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ హత్య వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయి ఎవరు చేసి ఉంటారా అని విచారణలో తేలుతుంది.మరి వివేకానందాను హత్య చెయ్యాల్సిన అవసరం ఎవరికీ ఉంటుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.