యువ‌తికి 40 వేలు ఇచ్చిన శ్రీనివాస‌రావు పోలీసుల విచార‌ణ‌లో షాకింగ్ నిజాలు బ‌ట్ట‌బ‌య‌లు

478

వైసీపీ అధినేత‌పై జ‌రిగిన కోడిక‌త్తి దాడి తెలిసిందే. ఈ దాడిలో జ‌గ‌న్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రెప్ప‌పాటులో ఆయ‌న మెడ‌పై ఈ వేటు ప‌డిఉంటే ప‌రిస్దితి ఏమిటి అని వైసీపీ నేతలు ప్ర‌జలు ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇక రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న విచార‌ణ‌పై న‌మ్మ‌కం లేదు అని వైసీపీ ముందు నుంచి నిల‌దీస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ బుధ‌వారానికి వాయిదా పడింది. కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఏపీ డీజీపీ, విశాఖపట్టణం పోలీస్‌ కమిషనర్‌, ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ను సుబ్బారెడ్డి తన పిటిషన్‌లో చేర్చారు.. ఇదే అంశంపై దాఖలైన పిల్‌ మంగళవారం విచారణకు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యం విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Image result for jaganసిట్‌ అధికారులు చేపట్టిన విచారణ ముమ్మిడివరంలో సోమవారం కూడా కొనసాగింది. ఠాణేలంక పెదపేటలోని శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి సోదాలు చేసి.. తండ్రి తాతారావు, తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజును సిట్‌ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. శ్రీనివాసరావు 20 రోజుల క్రితం మురమళ్లలో కోనసీమ ఉత్సవాలు జరిగిన ప్రాంతంలో గోదావరి ఒడ్డున కొంతమంది స్నేహితులకు శ్రీనివాసరావు భారీ విందు ఇచ్చాడని.. ఆ విందుకు ఒక యువతిని కూడా తీసుకొచ్చినట్లు సమాచారం తెలుసుకున్నారు..

Related image

ఈ విందుకు రూ.40 వేల వరకు చెల్లించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు.. అక్కడ ఏం మాట్లాడుకున్నారనే విషయాలపై సిట్‌ ఎస్‌ఐ వెంకట్రావు ఒక్కొక్కరినీ విడివిడిగా విచారిస్తున్నారు. శ్రీనివాసరావు స్నేహితులు మెల్లం రాజు, పులిదిండి దుర్గాప్రసాద్‌, మెల్లం ప్రభాకర్‌, మద్దెల ప్రకాశ్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. అందరి వాంగ్మూలాలను రికార్డు చేశారు. శ్రీనివాసరావుకు వరుసకు సోదరుడైన జనిపెల్ల సోమేశ్వరరావుపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఇంత పెద్ద‌మొత్తంలో అత‌నికి డ‌బ్బులు ఎలా వ‌చ్చాయి అని కూడా విచారిస్తున్నారు. అస‌లు 10 నుంచి 15 వేల రూపాయ‌లు జీతం వ‌చ్చే అత‌నికి ఎలా ఇంత డ‌బ్బు ముట్టింది అని వివ‌రాలుసేక‌రిస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే గ‌డిచిన ఆరునెల‌లుగా ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చుచేశాడు అని కూడా పోలీసులు తెలుసుకున్నారు. ఊర్లో పార్టీ ఇవ్వ‌డ‌మే కాకుండా స్నేహితుల‌ను ఇలా బ‌య‌ట‌కు తీసుకువెళ్లి తిరునాళ్ల ఉత్స‌వాళ్లో కూడా పార్టీ ఇచ్చాడు అనేది తెలుసుకున్నారు ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చిన యువ‌తి ఎవ‌రు అనే విష‌యం పైకూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. మ‌రో రెండు మూడు రోజుల్లో దీనిపై పూర్తి వివ‌రాలు అందుతాయి అని చెబుతున్నారు సిట్ అధికారులు. మ‌రి ఇది ప్లాన్ ప్ర‌కారం ఎవ‌రైనా చేయించారు అని అనుకుంటున్నారా లేదా ఇది అత‌నుఅభిమానిగా చేశాడు అని అనుకుంటున్నారా కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.