బాబు స‌మావేశం నుంచి సీనియ‌ర్ లీడ‌ర్ అవుట్

325

మొత్తానికి దేశంలో బీజేపీ వ్య‌త‌రేక వ‌ర్గాలు అన్ని ఏకం అవుతున్నాయి అనేది క‌నిపిస్తోంది….బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ సంప్రదించి కార్యచరణ రూపొందించుకుంటున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో చంద్రబాబు ఎన్సీపీ అధినేత షరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. త‌ర్వాత ఈ పార్టీ పెద్ద‌ల‌తో క‌లిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. కాగా మీడియా సమావేశం మధ్యలోనే ఫరూక్‌ అబ్దుల్లా లేచి వెళ్లిపోయారు. విమానానికి సమయం అయిపోయిందని వివరణ ఇచ్చారు.

‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. చంద్రబాబు మమ్మల్ని కలుస్తా అన్నారు. వ్యవస్థలను రక్షించుకోవాలి. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవాలి.ఆ దిశగా ప్రయత్నం చేస్తాం’ అని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ఇక సీబీఐ ఆర్బీఐ వ్య‌వ‌స్ద‌లు కేంద్రం చేతిలోకీలు బొమ్మ‌లు అవుతున్నాయి అని వీటిని కాపాడుకునే స‌మ‌యం వ‌చ్చింది అని అన్నారు. ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లాలి అని పిలుపునిచ్చారు ఆయ‌న‌.