పోలింగ్ లో చంద్రబాబు జగన్ ల మోసాన్ని పవన్ కళ్యాణ్ ఎలా బయట పెట్టాడో చూడండి ..

135

నిన్న ఏప్రియల్ 11 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ తో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి..ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీలు పొటీ పడ్డాయి..ఉదయం 7 గంట్లకు ప్రారంభమయిన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో సగటున 76.69 శాతం పోలింగ్‌ జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 71.43 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు ఓటింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లలోని కుప్ప్మ్ నుంచి పోటీ చేస్తుండగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు వై ఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు..మొదటి సారి ఎన్నికల బరిలో దిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో పోటీ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎన్నికలు సజావుగా జరగకుండా ఓటింగ్ శాతం తగ్గించేందుకు అధికార తెలుగుదేశం ప్రతిపక్ష వైకాపా పార్టీలు ప్రయత్నించాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు..80 శాతం పైచిలుకు ప్రజలు బ్రహ్మాండగా ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అనేక ఆటుపోట్లు తట్టుకొని పార్టీ తరుఫున నిలబడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఏ పార్టీకి తాము ఓటు వేసిందీ ప్రజలు స్పష్టంగా వీవీప్యాట్‌ ద్వారా చూడగలిగారని, అలాంటి తరుణంలో ఈవీఎంలపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు..

చాలా చోట్ల అధికార ప్రతిపక్ష పార్టీలు హింశకు పాల్పడి జనసేనకు ఓట్లు పడకుండా చేసారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు..అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు, జగన్ లు తం తమ అభ్యర్దుల గెలుపు కొసం అడ్డ దారులు తొక్కారని ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు.. చాలా చోట్ల రిగ్గింగ్ లకు పాల్పడ్డారని దీన్ని వ్యతిరేకించిన జన సేన కార్యకర్తలపై దాడులకు దిగారని ఈ సందర్భ్మగా అన్నారు..ఎన్ని కుట్రలు చేసినప్పటికీ తమ పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాదిస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.. పోలింగ్ లో చంద్రబాబు జగన్ ల మోసాన్ని బయటపెట్టిన పవన్ కళ్యాన్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..