జ‌గ‌న్ కు స్కూల్ విద్యార్ధులు అదిరిపోయే గిఫ్ట్ థాంక్స్ చెప్పిన జ‌గ‌న్

189

ఈ సారి గాంధీజ‌యంతి రోజున అనేక కొత్త ప‌థ‌కాలు అలాగే కొత్త నిర్ణ‌యాలు తీసుకున్నాయి కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. ముఖ్యంగా ప్లాస్టిక్ క‌వ‌ర్లు నిషేదించారు, అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఇక రాకుండా చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు, ప్లాస్టిక్ క‌వ‌ర్లు వాడితే ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా, ఆరునెల‌ల జైలు శిక్ష విధిస్తామ‌ని చెబుతున్నారు..ఇది కేంద్రం తీసుకువ‌చ్చిన కొత్త చ‌ట్టం, ఇక ఏపీలో అయితే మ‌ద్యం షాపులు ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది.. 25 శాతం షాపులు బంద్ అయ్యాయి, ఇక గ్రామ‌స‌చివాల‌యాలు కూడా అక్టోబ‌ర్ రెండు నుంచి ప్రారంభించారు సీఎం జ‌గ‌న్.

Image result for jagan

గాంధీ జయంతి రోజున తూర్పు గోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సచివాలయాల ద్వారా దాదాపు 500 సేవలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ కరప సచివాలయ ఉద్యోగులతో మమేకం అయ్యారు. వారిని ఆత్మీయంగా పలకరించారు, అభినందించారు.

Image result for jagan

గ్రామంలో పూర్తి హంగులతో ఏర్పాటు చేసిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడి ఉద్యోగులతో మమేకం అయ్యారు.. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. భుజం మీద చేయి వేసి మాట్లాడారు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తమ వద్దకు రావడం, అలా మాట్లాడడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేవు. కొందరు పాదాభివందనానికి ప్రయత్నిస్తే వద్దని జగన్ వారించారు. అభిమానంతో తలపై చేయి వేసి ఆశీర్వదించారు. గ్రూప్‌ ఫోటోలు కోరితే కాదనకుండా ఓకే చెప్పారు. అంద‌రూ బాగా ఉద్యోగం చేయాలి మీపై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నాను, మ‌న ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకురావాలి అని అన్నారు, లంచాలు లేని వ్య‌వ‌స్ధ కావాలి అని కోరారు ఆయ‌న‌.

ఈ క్రింద వీడియో చూడండి

ఇటు ముఖ్యమంత్రి జగన్‌కు స్కూల్ విద్యార్థులు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చారు. ఇద్దరు విద్యార్థులు తమ ప్రతిభతో సభను ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై అభిమానంతో హర్షిత అనే విద్యార్థిని ఏకంగా 4.03 లక్షల ముత్యాలతో, నవరత్నాలు పథకాల చిహ్నాలతో కూడిన చిత్రపటం రూపొందించారు. వేదికపై ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. అలాగే జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంబంధించిన 2700 పేపర్‌ క్లిప్పింగ్స్‌తో సాయికిరణ్‌ అనే ఆరో తరగతి విద్యార్థిని రూపొందించిన చిత్రపటాన్ని సభలో సీఎం ఆవిష్కరించారు. చిన్నారులు ఇచ్చిన గిఫ్ట్‌లకు ఫిదా అయ్యారు. అంతేకాదు వాటిని త‌మ అధికారుల‌కు ఇచ్చి జాగ్ర‌త్త‌గా ఆఫీసుకి తీసుకుర‌మ్మ‌ని చెప్పారు, చిన్నారులు ఎంతో ప్రేమ‌గా ఇచ్చిన ఆ గిఫ్టుల‌ను జ‌గ‌న్ అక్క‌డ వ‌దిలేయ‌కుండా ఆఫీసుకి తీసుకువెళ్లారు, దీంతో ఆ చిన్నారులు ఎంతో ఆనందించారు.

ఈ క్రింద వీడియో చూడండి