రాహుల్ కు బాబుకు క‌లిపి సాయిరెడ్డి పంచ్

266

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ క‌లిసి ఒకే వేదిక పంచుకోవ‌డం పై, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌న‌దైన శైలిలో పంచ్ విసిరారు.. రోజుకో పంచ్ తెలుగుదేశం పై విమ‌ర్శ‌ల రూపంలో చేస్తూ, తెలుగుదేశం అధినేత పై ట్వీట్లు చేస్తున్నారు ప్ర‌శ్నిస్తున్నారు సోష‌ల్ మీడియాలో. తాజాగా ఆయ‌న ఖ‌మ్మం వేదిక‌పై జ‌రిగిన ఈ రెండు పార్టీల నేత‌ల స‌మావేశం బ‌హిరంగస‌భ గురించి విమ‌ర్శించారు.

Image result for chandra babu

నిన్నటి వరకు చెప్పులు, రాళ్లు విసురుకుని, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న టీడీపీ, కాంగ్రెస్‌ అధ్యక్షుల కరచాలనాలు, ఆలింగనాలతో సభలో ఉద్వేగభరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయని ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది చూసి తట్టుకోలేని సభికుల ఆనందభాష్పాలు వరదగా మారి మోకాలి లోతున సభా స్థలి మునిగిపోయిందని సెటైర్లు వేశారు.

Image result for chandra babu rahul

ఇదంతా చూసి ఒళ్లు పులకరించిపోయిన ఓ వర్గం మీడియా తన పైత్యాన్ని పతాక స్థాయిలో చూపించిందని విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఖమ్మం పట్టణంలో మహాకూటమి నిర్వహించిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై విజ‌య‌సాయిరెడ్డి ఇటువంటి కామెంట్లు చేశారు.