టీడీపీలో చిన్న తుపాన్

472

నిజ‌మే అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో సుద‌ర్ఘ‌కాలం రాజ‌కీయంగా ఉన్న నేత ఎవ‌రు అంటే స‌బ్బంహ‌రి అని చెప్పాలి… కొంత కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న ఇక రాజ‌కీయంగా త‌న దూకుడు పెంచ‌బోతున్నారు… కాంగ్రెస్ నుంచి వైసీపీ వైపు వెళ్లి కొద్ది రోజుల‌కే ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు.. ఇక ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే తెలుగుదేశంలో చేరుతారు అని అనుకున్నారు అంద‌రూ.. కాని ఆయ‌న అన‌కాప‌ల్లికి ప‌రిమితం అయ్యారు…గ‌తంలో విశాఖ మేయ‌ర్ గా కూడా ఆయ‌న ప‌ని చేశారు.. దీంతో ఆయ‌న‌కు విశాఖలో కూడా ప్ర‌జా బ‌లం ఉంది.

Image result for స‌బ్బంహరి

2009లో కాంగ్రెస్ త‌ర‌పున అన‌కాప‌ల్లి ఎంపీ అయ్యారు.. మొత్తానికి గ‌త కొంత కాలంగా చంద్ర‌బాబును పొగుడుతున్న ఆయ‌న, తెలుగుదేశంలోకి చేరే మార్గం సుగుమం అయింది అని వార్త‌లు వ‌స్తున్నాయి…ఇక ఆయ‌న మ‌రో నెల‌రోజుల్లో క‌చ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరే అవ‌కాశం ఉంది అని అంటున్నారు జిల్లాలో ఆయ‌న కేడ‌ర్… తెలుగుదేశం పార్టీలో ఆయ‌న చేరిక‌కు చంద్ర‌బాబు కూడా ఉత్సుక‌త చూపుతున్నారు.. ఆయ‌న ఎంపీ టికెట్ ఎక్క‌డ అడిగితే అక్క‌డ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ఇక ప్ర‌స్తుత ఎంపీ అవంతిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్క‌న పెట్టి స‌బ్బంహరికి అన‌కాప‌ల్లి ఎంపీ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది…లేదు అంటే ఆయ‌న విశాఖ ఉత్త‌రం భీమిలి అన‌కాప‌ల్లి లేదా మాడుగుల నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.

Related image

దీంతో స‌బ్బంహ‌రి పార్టీలోకి వ‌చ్చి ఎవ‌రి సీటుకు ఎర్త్ పెడ‌తారా అని నేత‌లు కంగారుప‌డుతున్నారు పార్టీలో నాయ‌కులు మాత్రం దీనిపై ఎటువంటి మ‌న‌స్ప‌ర్ద‌లు లేవు అని చెబుతున్నారు.. హ‌రి కుదిరితే అన‌కాప‌ల్లి నుంచి ఎంపీగా లేదా అస‌కాప‌ల్లినుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు అని తెలుస్తోంది.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఆయన స్టేట్ లో మంత్రి ప‌ద‌వి పొందాలి అని చూస్తున్నారు మ‌రిచూడాలి ఆయ‌న కోరిక నెర‌వేరుతుందా లేదా అనేది.