ఆ పార్టీలోకి స‌బ్బం హరి ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది

570

తెలుగుదేశం పార్టీలో చేర‌డానికి వైసీపీలో చేర‌డానికి ఈ నాలుగు సంవ‌త్స‌రాలుగా రాజ‌కీయంగా దూరంగా ఉన్న నాయ‌కులు పార్టీల వైపు చూస్తున్నారు…ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో త‌న ఉనికిని కోల్పోయిన త‌ర్వాత, ఆ పార్టీ నాయ‌కులు కొంద‌రు, రాజ‌కీయంగా ఈ నాలుగు సంవ‌త్స‌రాలు సైలెంట్ గా ఉన్నారు….కాంగ్రెస్ లో కూడా నాయ‌క‌త్వం లేక‌పోవ‌డంతో కాస్త పార్టీకి దూరంగా ఉండిపోయారు.. అయితే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ పుంజుకుంటున్నా ఇంకా నాయ‌క‌త్వ లేమి క‌నిపిస్తోంది.

Image result for స‌బ్బం హరి

దీంతో వారు ఇంకా డైల‌మాలో ఉన్నారు.. అందుకే ఇటు కిర‌ణ్ సార‌థ్యంలో కూడా ముందుకు వెళ్లే ఆలోచ‌న మాజీలు చేయ‌డం లేదు.. ఇటు పార్టీలోకి కొత్త నీరు వ‌స్తోంది అనుకుంటే, అంతా 60 దాటిన సీనియ‌ర్లే, యువ నాయ‌క‌త్వం కాంగ్రెస్ వైపు చూడ‌టం లేదు.. ఇటు మ‌రోప‌క్క హ‌స్తిన కాంగ్రెస్ కు దేశంలో ఏ పేరు ఉందో ఆ పేరు ఇప్పుడు ఇక్క‌డ ఏపీ కాంగ్రెస్ కు వ‌చ్చే అవ‌కాశం ఉంది అని అంటున్నారు.

Image result for స‌బ్బం హరి

ఇటు ఉత్త‌రాంధ్రా రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌గా స‌బ్బం హ‌రికి ఓ ఫేమ్ ఉంది.. కాంగ్రెస్ పార్టీలో అన‌కాప‌ల్లి త‌ర‌పున 2009 లో ఎంపీగా విజ‌యం సాధించారు.. అయితే ఇక్కడ హ‌రి సీనియ‌ర్ నేతేకాని, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ఎటువైపు జంప్ చేయ‌కుండా స్ద‌బ్దుగా ఉండిపోయారు.. అయితే ఇప్పుడు మాత్రం నాలుగు సంవ‌త్స‌రాల నుంచి సైలెంట్ గా ఉన్న స‌బ్బం హ‌రి చంద్ర‌బాబును కీర్తిస్తున్నారు.. తెలుగుదేశం పార్టీపై త‌న అభిమానం తెలియ‌చేస్తున్నారు.. ఎందుకు అంటే ఇక్క‌డ ఉన్నా సిట్టింగ్ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డానికి చూస్తున్నారు..

Image result for స‌బ్బం హరి

ఇటు వైసీపీ త‌ర‌పున సీటు ఆల్రెడీ ఫిక్స్… ఇక జ‌న‌సేన నుంచి దాడి వీర‌భ‌ద్ర‌రావు పార్టీలో చేరితో ఎంపీనా ఎమ్మెల్యేగా పోటీనా అనేది చూడాలి.. ఇక ఆయ‌న‌కు ఉన్న ప్ర‌త్యామ్నాయం టీడీపీ.. అందుకే స‌బ్బం హ‌రి టీడీపీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి నుంచి పోటీ చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది అని తెలుస్తోంది. మ‌రి వైసీపీ త‌ర‌పున పార్టీలో కొణ‌తాల చేరినా ఆయ‌న‌కు సీటు ఇచ్చే ఆస్కారం ఉంది.. అందుకే బెల్లం ఫేమ‌స్ అయిన అన‌కాప‌ల్లిలో ఇప్పుడు రాజ‌కీయాలు మ‌రింత హీట్ ఎక్క‌నున్నాయి. చూడాలి మ‌రి ఆయ‌న తెలుగుదేశం జెండా ప‌ట్టుకుంటారా లేదా కొత్త నిర్ణ‌యం తీసుకుంటారా అనేది…అయితే ఆయ‌న అనుచ‌రులు మాత్రం, తెలుగుదేశంలో చేర‌డం ప‌క్కా అని అనకాప‌ల్లి ప్రాంతంలోనే కాదు జిల్లా అంతా చ‌ర్చించుకుంటున్నారు.