టీడీపీకి రోజా స‌రికొత్త డిమాండ్

544

న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యేరోజా తెలుగుదేశం పార్టీపై విమ‌ర్శ‌ల అస్త్రాలు ఎప్పుడూ వ‌దులుతూనే ఉంటారు…తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్ర‌జ‌ల‌కు నెర‌వేర్చ‌లేద‌ని ఆమె నిల‌దీస్తూనే ఉంటారు. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలుగుదేశానికి టీటీడీని ఓ డిమాండ్ చేశారు…తిరుమల శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో ఇంకా అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్‌లైన్ చేస్తామని జేఈవో చెప్పారని, ఎనిమిదేళ్లు అయినా ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు.

YSRCP MLA RK Roja Slams Chandrababu Naidu - Sakshi
ఇక వెంటనే శ్రీవారి ఆభరణాలు, ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుని భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌కూడ‌ద‌ని ఆమె కోరారు. ఇక ఇక్క‌డ వివాదాలు జ‌రుగుతున్నా ప‌ట్టించుకునే నాధుడే లేర‌ని స్వామికి సేవ చేసేవారికే ఇబ్బందులు వ‌స్తుంటే ప‌రిస్దితి ఏమిటో తెలుస్తోంది అని ఆమె ప్ర‌శ్నించారు.

Image result for roja

శ్రీవారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుడిగా ఉన్న రమణదీక్షితులును విధుల నుంచి తొలగించి అవమానించడం చాలా బాధాకరమని ఆమె అన్నారు..సీఎం చంద్రబాబు నాస్తికుడు అనడానికి ఇది చాలని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్‌ అర్చకులకు పూర్వవైభవం తీసుకువస్తామని ఎమ్మెల్యే రోజా తెలియ‌చేశారు జిల్లా వైసీపీ నేత‌లు క‌డ‌ప వైసీపీ నాయ‌కులు తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్నారు.