కేసీఆర్ స‌భ‌కు వెళ్లి ఆ ప‌ని చేస్తా రేవంత్ రెడ్డిభార్య సంచ‌ల‌న స్టేట్ మెంట్

367

డిసెంబరు 4న కోస్గిలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించడమే కాదు, అదే రోజు కొడంగల్ బంద్‌కు పిలుపునివ్వడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పోలీసులు చర్యలపై రేవంత్ రెడ్డి భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లలోకి పోలీసులు చొరబడి భయభ్రాంతులకు గురిచేసి, మహిళలను ఇబ్బంది పెడుతుంటే రేవంత్ రెడ్డి నిరసనకు దిగారు.. ఇంకా దాడులు జరిగే అవకాశం ఉందని అదే రోజు ఆయన హెచ్చరించారు… కొడంగల్ ప్రజలమీద జరుగుతోన్న దాడులకు ఇది కొనసాగింపు…తెల్లవారుజామున 3 గంటల సమయంలో తలుపులు బద్దలుగొట్టి ఒక 50 మంది పోలీసులు లోనికి చొరబడ్డారని, తన భర్తను ఓ ఉగ్రవాదిలా చూశారని’ ఆమె ఆరోపించారు. 144 సెక్ష‌న్ ఇక్క‌డ అమ‌లులో ఉంటే ఎలా కేసీఆర్ స‌భ నిర్వ‌హిస్తారు అని ఆమె ప్ర‌శ్నించారు.

Image result for revanth reddy wife
అందరం ఉండగానే కేవలం ఐదు నిమిషాల్లోనే రేవంత్‌ను ఉగ్రవాదిలా బరబరా ఈడ్చుకుంటూ వెళ్లారని గీత ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఐడీ కార్డులు కూడా చూపించకుండా ఇంట్లోకి చొరబడ్డారని, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరింట్లోకి పడితే వారింట్లోకి వెళ్లడానికి పోలీసులకు హక్కు ఎవరిచ్చారని?.. అలాంటి హక్కును రాజ్యాంగం వారికేమైనా ఇచ్చిందా? అని నిలదీశారు.తమ ఇంటికి వచ్చిన పోలీసులు ఎవరో కూడా తెలియదని, ఒక అధికారి మాత్రం పైఅధికారుల ఆదేశాల మేరకే అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారని గీత వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కే లేదా, ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వ‌మా అని గీత నిలదీశారు. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడి అని, కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని, శాంతియుతంగా నిరసన తెలిపి, హింసకు పాల్పడవద్దని ఆమె పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించి, నియంత పాలనకు చరమ గీతం పాడాలని కోరారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ భార్య గీత బయల్దేరిన సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రేవంత్‌ భార్య గీత వాగ్వాదానికి దిగారు. రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది ఎవరో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రేవంత్ ఎక్కడున్నాడో చెప్పాలని పోలీసులను ఆమె నిలదీశారు. రేవంత్‌ను పోలీసులే అరెస్ట్‌ చేశారా? మరెవరైనా అరెస్ట్‌ చేశారా అని పోలీసులను ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయని రేవంత్‌ భార్య గీత వ్యాఖ్యానించారు.144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు కేసీఆర్ సభ ఎలా నిర్వహిస్తారని ఆమె పోలీసులను ప్రశ్నించారు. అయితే… ఆమె ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. సభకు అనుమతులున్నాయని చెప్పారు. దీంతోనేను స‌భ‌కు వెళ్లి నేరుగా కేసీఆర్ ని ప్రశ్నిస్తా అని త‌న‌కు అనుమ‌తి ఇవ్వాలని పోలీసుల‌కు ఆమె కోరారు. ఇలా ఆమె చెప్ప‌డంతో అక్క‌డ హైటెన్ష‌న్ వాతావార‌ణం నెల‌కొంది. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.