ఎమ్మెల్యే ప‌ద‌వికి రేవంత్ రెడ్డి రాజీనామా

345

తెలంగాణ రాజ‌కీయాల్లో ఆయ‌న టైగ‌ర్ గా పేరు తెచ్చుకున్నారు.. రాజకీయ నాయకుడు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న స్పీక‌ర్ కార్యాల‌యంలో స్పీక‌ర్ తో చ‌ర్చించి, స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి ఆయన‌ రాజీనామా లేఖ‌ను అందించాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే ఆయ‌న రాజీనామా కుద‌ర‌దు అని చెప్ప‌డంతో, ఆయ‌న స్పీక‌ర్ పీఏకు రాజీనామా లేఖ‌ను అంద‌చేశారు.

Image result for revanth reddy

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తున్న స‌మ‌యంలో, ముఖ్య‌మంత్రి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.. ఈ స‌మ‌యంలో ముఖ్యమంత్రి వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌క తాను రాజీనామా చేస్తున్న‌ట్లు తెలియ‌చేశాడు…కేసీఆర్ చిలక జోస్యాన్ని నమ్ముకుని పరిపాలన సాగిస్తున్నారని, ఆయనకు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలంటే కేసీఆర్‌ ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు.

Image result for revanth reddy

కేసీఆర్‌ ఉన్న శాసనసభలో తానుండలేనని చెప్పారు. కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజల మధ్య ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవిని వదులుకున్నట్టు తెలిపారు. మొత్తానికి ఇప్పుడు టీడీపీతో గెలిచిన ఎమ్మెల్యే ప‌ద‌విని, కాంగ్రెస్ లో చేరిన త‌ర్వాత, ఇప్పుడు కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళుతున్న స‌మ‌యంలో ఆయ‌న రాజీనామా చేయ‌డం పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.. మ‌రో వైపు కాంగ్రెస్ త‌ర‌పున సీఎం అభ్య‌ర్దిగా ఆయ‌న ఉంటారా అనే ఆలోచ‌న కూడా వ‌స్తోంది ఇప్పుడు తెలంగాణ పొలిటిక‌ల్ సర్కిల్స్ లో.