రేవంత్ రెడ్డి భార్య సంచలన నిర్ణయం

265

తెలంగాణ‌లో ఎన్నికల ప్ర‌చారం హోరెత్తింది ..అంతే కాదు ఈ స‌మ‌యంలో ప‌లువురు నేత‌ల అరెస్టుల‌తో పెద్ద ఎత్తున ఇక్క‌డ చ‌ర్చ జ‌రుగుతోంది. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో, కొడంగ‌ల్ లో నేత‌లు అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల‌మీద‌కు వ‌స్తున్నారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో రేవంత్ ని అరెస్ట్ చేయ‌డం పై ఆయ‌న భార్య పోలీసుల‌ని ప్ర‌శ్నించారు.రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ భార్య గీత బయల్దేరిన సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రేవంత్‌ భార్య గీత వాగ్వాదానికి దిగారు.

Image result for revanth reddy

రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది ఎవరో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రేవంత్ ఎక్కడున్నాడో చెప్పాలని పోలీసులను ఆమె నిలదీశారు. రేవంత్‌ను పోలీసులే అరెస్ట్‌ చేశారా? మరెవరైనా అరెస్ట్‌ చేశారా అని పోలీసులను ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయని రేవంత్‌ భార్య గీత వ్యాఖ్యానించారు. వారు ఐడెంటిటి కార్డులు కూడా చూపించ‌లేదు అని అన్నారు.144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు కేసీఆర్ సభ ఎలా నిర్వహిస్తారని ఆమె పోలీసులను ప్రశ్నించారు అయితే… ఆమె ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. సభకు అనుమతులున్నాయని చెప్పారు. అయితే.. సభకు వెళ్లేందుకు తనకు కూడా అనుమతినివ్వాలని ఆమె పోలీసులను కోరారు. ఇలా అరెస్ట్ చేస్తే ఎందుకు తాము ఊరుకుంటాము అని ఆమె ప్ర‌శ్నించారు.