KCR ని ఢీ కొట్టేందుకు రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

385

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముగిసాయి, ఇక రెండోవ సారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది, కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం కూడా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేవ‌లం కొన్ని సీట్లు గెలిచి ఇక్క‌డ తెలంగాణ‌లో బ‌ల‌హీన‌మైన ప్ర‌తిప‌క్షంగా మారిపోయింది. ఇక రేవంత్ రెడ్డి జానారెడ్డి , డీకే అరుణ‌లాంటి నాయ‌కులు ఓట‌మి చెంద‌డం పార్టీ ప‌రిస్దితి తెలంగాణ‌లో ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి రాజ‌కీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది, కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్ది అని అంద‌రూ అనుకున్నారు.. కాని రేవంత్ ఓటమి చెంది అంద‌రికి షాక్ ఇచ్చారు, అలాగే టీఆర్ఎస్ పార్టీలో కూడా మంత్రులు కూడా ఓడిపోయి, ఇంటికి ప‌రిమితం అయ్యారు. తాజాగా ఓ ఇద్ద‌రు నేత‌లు ఎంపీలుగా పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. మ‌రి ఆ విష‌యం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Image result for kcr

మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌ వైపు చూస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో పరాజయం పొందిన వీరిద్దరూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ఇద్దరు ముఖ్యనేతలు ఓటమి చెందడం రెండు పార్టీల నాయకత్వానికి నష్టం జరిగింది. మహేందర్‌రెడ్డి చేవెళ్ల నుంచి, రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ లేదా మరే ఇతర స్థానం నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది.వీరిద్దరూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీ వల జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి పరాజయం పాలైన విషయం తెలిసిందే. అలాగే కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన రేవంత్‌రెడ్డి ఓటమి చెందారు.

Image result for revanth reddy

ఆ ఇద్దరు ముఖ్యనేతలు ఓటమి చెందడం రెండు పార్టీల నాయకత్వానికి నష్టం జరిగింది. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ వ్యవహారాల్లో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి కీలకంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన ఓటమి చెందడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అలాగే ఇటు రేవంత్‌రెడ్డి ఓటమి కూడా కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌ అనే చెప్పాలి. వీరిద్దరూ కూడా క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే అవకాశం వస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు.మహేందర్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. వచ్చేఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు సిద్థంగా ఉండాలని ఆయన్ని ఆదేశిం చినట్లు సమాచారం. ఇక రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒకవేళ అక్కడ అవకాశం లభించకుంటే మరే ఇతర స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తే తిరిగి మంత్రి కావొచ్చని భావించారు. ఈ మేరకు పార్టీ నాయకత్వానికి తన మనసులో మాట చెప్పినట్లు తెలిసింది. కానీ పార్టీ నాయకత్వం ఇందుకు భిన్నంగా స్పందించింది. ఎమ్మెల్సీ ఇవ్వడం కుదరదని, ఎంపీగా అవకాశం ఇస్తామని తెలిపింది. దీనికి ఆయన అంగీకారం కూడా తెలపడంతో ఇక పార్లమెంట్‌ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.మ‌రి వీరిద్ద‌రు ఇలాఎంపీలుగా పోటీ చేయ‌డంపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.