కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డి……. కిడ్నాప్ షాక్ లో కాంగ్రెస్ పార్టీ

343

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇక రేవంత్ రెడ్డి ఇక్క‌డ ఓడిపోవ‌డంతో ఇక్క‌డ ప్ర‌శ్నించే వారు లేక‌పోవ‌డంతో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది అని కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథ్‌ను బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న విశ్వనాథ్‌ను దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. నిటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా విశ్వనాథ్ నేడు నామినేషన్ వేయాల్సి ఉంది. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో ఆయన నామినేషన్‌ను అడ్డుకునేందుకే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

Image result for revanth reddy

 

తన నియోజవర్గంలో తన పార్టీ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ అయ్యారన్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హుటాహుటిన నిటూరు గ్రామానికి చేరుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకుని, కిడ్నాప్ వ్యవహారంపై ఎస్పీ అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. రేవంత్ ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. నేడు నామినేషన్ వేయాల్సిన విశ్వనాథ్ 9 గంటలుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నిటూరు గ్రామంలో గతంలో పలు హత్యలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. విశ్వనాథ్‌ను నామినేషన్ వేయకుండా ఆపేందుకే కిడ్నాప్ చేశారా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎటువంటి కామెంట్లు చేయ‌కుండా దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా, ఏదైనా ప‌గ‌ల‌తో కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు, ఇప్ప‌టికే ఓట‌మితో ఉన్న రేవంత్ దీనిని మ‌రింత రాజ‌కీయం చేస్తే మ‌రోసారి అడ్డంగా ఇది రివ‌ర్స్ అవుతుంది అని ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ కిడ్నాప్ వెనుక అస‌లు మ‌త‌లబు ఏమిటో చూడాలి… మ‌రి దీని వెనుక రీజ‌న్ ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.