టీడీపీకి రాజీనామా చేస్తా

258

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఓ ఎమ్మెల్యే రాజీనామాకు సిద్దం అయ్యారు. అయితే ఎవ‌రు ఆ ఎమ్మెల్యే ? ఎందుకు అధికార పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ‌తాను అని అన్నారు, ఈ కామెంట్లు ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నిడదవోలు మండలం కలవచర్లలోని పంట మురుగుకాలువ పూడ్చి సీఎన్జీ గ్యాస్‌ గొడౌన్‌ నిర్మాణానికి అధికారులు అనుమతించడంపై రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు బాసటగా నిలిచారు. గొడౌన్‌ నిర్మాణ పనులు ప్రారంభించడంతో కొద్ది రోజులుగా అధికారులకు రైతులకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పోలీసుల సహకారంతో అధికారులు కలవచర్ల చేరుకున్నారు.

ఇక రైతుల స‌మ‌స్య‌లు తీరుస్తాను అని ఎమ్మెల్యే ఆ ప్రాంతాని కి చేరుకుని మురుగు డ్రైనేజీపై గొడౌన్‌ నిర్మాణానికి ఎలా అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను నిలదీశారు ఆ ఎమ్మెల్యే. రైతులకు వ్యతిరేకంగా అధికారులు చర్యలు తీసుకుంటే త‌న ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి పోరాడతానని అధికారులను హెచ్చరించారు. ఎమ్మెల్యేతో చర్చించిన త‌ర్వాత‌ అధికారులు పనులు నిలిపివేసి వెనుదిరిగారు..