జైపాల్ రెడ్డి కుమార్తెని లవ్ మ్యారేజ్ చేసుకున్న రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి ఏం చేశారంటే

1319

అలుపెరుగని రాజకీయ యోధుడు.. సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో కొనసాగుతూ.. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ తనదైన ముద్రవేసిన విలక్షణ నాయకుడు ఎస్ జైపాల్‌రెడ్డి. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఐదుసార్లు ఎంపీగా గెలుపొంది.. కేంద్రంలో కీలక మంత్రులు నిర్వహించిన జైపాల్‌రెడ్డి తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారు. నిజాయితీ, నిర్భీతిగల నాయకుడిగా, అవినీతి మరక అంటని సచ్ఛీలుడిగా జాతీయ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్ రెడ్డికి విశిష్ట గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన జైపాల్‌రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీతో విభేదించి జనతా పార్టీలో చేరారు. అనంతర కాలంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి.. అనేక పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారని అంటారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా, నిరంతర కార్యశీలిగా, రాజకీయ దిగ్గజంగా పేరొందిన ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయిందని రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపాలు వ్యక్తమవుత్నునాయి.

Image result for revanth reddy wife geetha

ఈ సందర్భంగా ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా జైపాల్‌రెడ్డి దేశానికి చేసిన సేవలను చిరస్మరణీయమని కేసీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక జైపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం గురించి చాలా మందికి తెలియదు, అసలు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో చిన్నస్ధాయిలో ఉన్న సమయంలో, జైపాల్ రెడ్డి కుటుంబంలో అమ్మాయిని ప్రేమించాడు…జైపాల్ రెడ్డి సోదరుడు పద్మారెడ్డి కుమార్తె గీత రేవంత్ రెడ్డి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ ప్రేమించుకోవడంతో ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. రేవంత్ ఉద్యమ నాయకుడిగా ఉంటూ ఏబీవీపి గొడవల్లో అతనిని చూసి గీత తండ్రి రేవంత్ తో పెళ్లి వద్దన్నారు.

ఈ క్రింద వీడియోని చూడండి

అయితే పెద్ద స్దోమత లేకపోవడం అలాగే రాజకీయాల్లో ఉండటంతో జైపాల్ రెడ్డి సోదరుడు తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ద పడలేదు కాని రేవంత్ రెడ్డి గీత మాత్రం ఎంతో ఇష్టపడుతున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డికి తెలియకుండా గీతని తన అన్న ఎంపీగా ఉన్న జైపాల్ రెడ్డి దగ్గరకు దిల్లీ పంపించారు. అయినా రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి తనకి ఇచ్చి పెళ్లి చేయాలని గొడవ పెట్టుకున్నాడు.. ఇక ఇద్దరికి ఇష్టం కావడం పైగా ఒకే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారి పెళ్లికి ఒప్పుకుని ఘనంగా చేశారు.. అయితే తర్వాత రేవంత్ రెడ్డి తన భార్యని ఎంతో బాగా చూసుకున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా రాజకీయాల్లో మంచి స్ధాయికి వస్తాడని జైపాల్ రెడ్డి నమ్మారట. తన తమ్ముడు కూతురైన గీతకిచ్చి పెళ్లి చేయడానికి జైపాల్ రెడ్డి ముందుకు వచ్చారట. నేడు అదే స్ధాయిలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా రేవంతరెడ్డి ఎదిగారు. అందుకే రేవంత్ రెడ్డి అంటే జైపాల్ రెడ్డికి ఎంతో ఇష్టమట.ఇది వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్, మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.