టీవీ9 నిజంగా అమ్మేస్తున్నారా?

441

తెలుగులో టాప్ మీడియా ఇక ఆ ఛాన‌ల్ వార్త‌లు చూస్తే ఒరిజినాలిటి క‌నిపిస్తుంది అని అంటారు అలాంటి టీవీ9 పై ఇప్పుడు స‌రికొత్త వార్త‌లు వినిపిస్తున్నాయి గ‌త కొద్ది కాలంగా ఆ సంస్ధ అధినేత శ్రీనిరాజు టీవీ9 అమ్మకానికి సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత ఉందో తెలియ‌దు కాని టీవీ9 అమ్మ‌కానికి సిద్దంగా ఉంది ఆ సంస్ద ని కొనుగోలు చేయ‌డానికి ఇద్ద‌రు బ‌డా వ్యాపార‌వేత్త‌లు రెడీగా ఉన్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.

Related image

 

ఈ సంస్ద‌ని 500 కోట్ల రూపాయ‌ల‌కు అమ్మాలని నిర్ణ‌యించార‌ట బ్రాండ్ వాల్యూతో. ఇక దీనిపై అధికారికంగా ఎవ‌రి నుంచి ప్ర‌క‌ట‌న అయితే వెలువ‌డ‌లేదు ఇలాంటి వార్త‌లు వ‌చ్చిన స‌మ‌యంలో మీడియా త‌ర‌పున ఖండించే టీవీ 9 కూడా దీనిపై ఖండించ‌లేదు.మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అలాగే మై హోమ్ గ్రూప్ సంస్థలు క‌లిసి టీవీ9 ను చేజిక్కించుకుంటాయి అని వార్త‌లు వ‌స్తున్నాయి.

Image result for tv9 channelఅయితే గ‌తంలో కూడా మైహోమ్స్ ఈ సంస్ధ‌ని కొనుగోలు చేస్తుంది అని అనుకున్నారు.. కాని డీల్ స‌రిగ్గా క్లోజ్ అవ్వ‌లేదు .. కాని ఇప్పుడు మాత్రం టీవీ9 యొక్క అన్ని బాషలు తెలుగు, కన్నడ ఇతర భాషల్లో హక్కులను కైవసం చేసుకున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి…టీవీ9కు తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ ఛానల్స్ ఉన్నాయి. మ‌రి దీనిపై ఛానెల్ నుంచి ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.