నేటి నుంచి వైసీపీ స‌రికొత్త కార్య‌క్ర‌మం

297

వినూత్న కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లే పార్టీ ఏమైనా ఉంది అంటే అది వైసీపీ అనే చెప్పాలి.. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా సరికొత్త కార్య‌క్ర‌మానికి స‌మాయ‌త్త‌మైంది, దీనిపై వైసీపీ శ్రేణులు రెడీ అయ్యారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాలతో జరిగే లబ్ధి గురించి వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ రోజు నుంచి రావాలి జగన్‌… కావాలి జగన్ అనే నినాదంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను స్వయంగా కలుసుకుంటాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు వారికి వివరించడంతో పాటు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేళ్లు పార్టీ కార్యకర్తలు వివరిస్తారు.

Image result for jagan

గ‌త వారం జ‌గ‌న్ నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది వైసీపీ గ‌డ‌ప గ‌డ‌ప‌కు న‌వ‌రత్నాలు ఇలా ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది.ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించడంతో పాటు, టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వారిని మరింత జాగృతం చేస్తారు. పాదయాత్ర జరిగే జిల్లాలు మినహా మొత్తం 168 నియోజకవర్గాల్లో ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 17 నుంచి బూత్‌ కమిటీ సభ్యులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతి రోజూ కనీసం రెండు పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ఆయా ప్రాంతాల్లోనూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వివరిస్తారు.

Image result for jagan

ప్ర‌జా క్షేత్రంలో పార్టీ మ‌రింత ముందుకు వెళ్లాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు పార్టీ అధినేత‌…ఇక బూత్ లెవ‌ల్లో పార్టీ మ‌రింత ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా వైసీపీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది.. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం పార్టీకి మ‌రింత ఉప‌యోగ‌ప‌డుతుంది అని పార్టీ నాయ‌కులు అంద‌రూ భావిస్తున్నారు ముఖ్యంగా యువ‌త‌కు ఆక‌ట్టుకునే విధంగా వైసీపీ ముందుకు వెళుతోంది.