వైసీపీలో చేరుతున్నా రామ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌ట‌న

357

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు నెల్లూరు నాయ‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమ‌ల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి.. ఆయ‌న ఆత్మీయులు, నేదురుమ‌ల్లి అభిమానులు.. నియోజ‌క‌వ‌ర్గ అభిమానులు స‌మ‌క్షంలో వారి నిర్ణ‌యాలు అడిగి తెలుసుకున్నారు.. తాను వైసీపీలో చేరేందుకు సిద్దం అవుతున్నాను అని తెలియ చేశారు..

Image result for ycp flag

వారు కూడా ఆయ‌న నిర్ణ‌యాన్ని గౌర‌వించి వైసీపీలో చేరితే తాము ఎటువంటి అడ్డు చెప్ప‌మ‌ని అన్నారు.. ఆయ‌న ఎంట్రీ పై ఇక ప్ర‌క‌ట‌న వెలువడిన‌ట్టే ..ఆయ‌న జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ చేరుకున్నాక పార్టీలో చేరుతారా లేదు ముందే చేరుతారా అని జిల్లాలో చ‌ర్చించుకుంటున్నారు. ఈ నెలలో జిల్లాలో ఇరువురు కీల‌క నేత‌లు వైసీపీలోకి చేర‌నుండ‌టంతో వైసీపీ మ‌రింత హుషారులో ఉంది.

Image result for ycp flag

ఇటు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా వైసీపీలో ఈ నెల 13 న చేరేందుకు రెడీ అవుతున్నారు.. ఇద్ద‌రూ క‌లిసి ఓకే రోజు పార్టీలో చేరుతారా అని కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఆనం ఎగ్జిట్ మైన‌స్ అయితే, ఇటు వైసీపీకి ప్ల‌స్ అవ్వ‌బోతోంది …హూదా విష‌యంలో బీజేపీ ఏపీలో మ‌రింత దారుణ‌మైన స్దితికి వెళ్లింది… దీంతో రామ్ కుమార్ రెడ్డి కూడా రాజ‌కీయంగా భ‌విష్య‌త్తును ఆలోచించి బీజేపీకి గుడ్ బై చెబుతున్నారు.. సో నెల్లూరు జిల్లాలో న‌యా రాజ‌కీయాలు ఇక క‌నువిందుచేయ‌నున్నాయి.