తెలంగాణ‌లో రాహుల్ ప‌ది స‌భ‌లు కొత్త మాస్ట‌ర్ ప్లాన్

394

తెలంగాణ‌లో రాజ‌కీయంగా హీట్ మొద‌లైంద‌ని చెప్పాలి.. ఇప్ప‌టికే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెలంగాణ‌లో టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌క‌ట‌న చేసింది ఇక అసెంబ్లీ ర‌ద్దు అయింది తెలంగాణ‌లో రెండోవ ప్ర‌త్యామ్నాయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నిక‌ల‌కు రెడీ అయింది ఇక సీడ‌బ్లూసీ లెవ‌ల్లో మీటింగులుజ‌రుగుతున్నాయి ఇక 105 సెగ్మెంట్ల‌కు అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ మ‌రో 14 సెగ్మెంట్ల‌కు అభ్య‌ర్దుల‌ను రేపో మాపో ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది ఈ స‌మయంలో కాంగ్రెస్ ఇంకా ఆదిలోనే ఉంది ఇంకా అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది ముఖ్యంగా పొత్తుల సంప్ర‌దింపులు ఇంకా పార్టీని ఓ నిర్ణ‌యానికి తీసుకురాకుండా చేశాయి.

Image result for rahul gandhi

తెలంగాణ‌లో హిట్లర్, తుగ్లక్‌లా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి కుంతియా వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. తాము తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు.నేడు టీ కాంగ్రెస్ నేత‌లు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌హా రాష్ట్రంలో ఉన్న‌నేత‌లు అంద‌రూ ఆయ‌న‌తో చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు.

Image result for rahul gandhi

ఇక అంద‌రూ క‌లిసి ప‌నిచేయాల‌ని చెప్పార‌ని కుంతియా చెప్పారు ఇక నాయ‌కులు ఒక్కొక్క‌రితో రాహుల్ మాట్లాడార‌ని ఎట్టి ప‌రిస్దితుల్లో పార్టీ గురించి ఏ చిన్న విష‌యాన్ని కూడా కాంగ్రెస్ నాయ‌కులు మీడియాకు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని తెలియ‌చేశారు.. పొత్తులపై టీడీపీ, వామపక్షాలతో చర్చల బాధ్యత పీసీసీ చీఫ్, ఇతర నేతలకు బాధ్యత అప్పగించినట్లు చెప్పారు. అయితే తుది నిర్ణయం మాత్రం ఏఐసీసీ అధ్యక్షుడిదేనని కుంతియా స్పష్టం చేశారు. సీట్ల పంపకంలో మిత్ర ధర్మాన్ని పాటిస్తామన్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో రాహుల్ గాంధీ బహిరంగ సభలు ఉంటాయని కుంతియా తెలిపారు. ఇక టీఆర్ఎస్ మాత్రం విజ‌యం పై ప‌క్కాగా ధీమాగా ఉంది.