మోడీని ఆలింగ‌నం చేసుకున్న రాహుల్ ఆశ్చ‌ర్య‌పోయిన ప్ర‌ధాని

480

అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌సంద‌ర్బంగా లోక్ స‌భ‌లో…కాంగ్రెస్ -బీజేపీ -తెలుగుదేశం-టీఆర్ఎస్ -ఈ పార్టీ నాయ‌కుల వ్యాఖ్య‌ల‌తో స‌భ ద‌ద్ద‌రిల్లింది అనే చెప్పాలి.. ఈస‌మ‌యంలో ఆవేశ పూరిత ప్ర‌సంగం చేశారు కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. నన్ను ప‌ప్పు అనుకున్నా ప‌ర్వాలేదు దేశం కోసం భ‌రిస్తా అని ఆయ‌న అన్నారు.. ఎంపీ రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో స‌భలో స‌భ్యులు అంద‌రూ అవాక్క‌య్యారు… మెజార్టీ ఉన్న బీజేపీ కూడా కాస్త ఆలోచ‌న‌లో ప‌డింది.

Image result for modi and rahul

లోక్‌సభలో ఎంపీ రాహుల్ ప్రసంగం ముగించే ముందు ప్రధాని మోదీ దగ్గరికి రాహుల్ వెళ్లారు. నా మీద మీలో కోపం, ద్వేషం ఉన్నాయి. నేను వాటిని తొలగిస్తా అని మోదీ దగ్గరికెళ్లి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి …. ఆలింగనం చేసుకొని తన సీటులోకి వచ్చి కూర్చున్నారు. అయితే ముందు మోడీ నిల‌బ‌డితే ఆలింగ‌నం చేసుకుందామ‌నుకున్న రాహుల్ ఆశ‌ను మోడీ నెర‌వేర్చేలేదు.. ఆయ‌న సీట్లోనే కూర్చున్నారు.. ఇక త‌ర్వాత ఆయ‌న సీట్లో ఉన్న‌మోదీని ఆలింగ‌నం చేసుకుని అక్క‌డ‌నుంచి వెనుదిరుగుతుంటే ప్ర‌ధాని మోడీ రాహుల్ ని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు.Image result for modi and rahulఎవ‌రూ ఊహించ‌ని ఈ ప‌రిణామంతో రాహుల్‌ చర్యతో ప్రధాని మోదీ సైతం అవాక్కయ్యారు… ఈ సంఘటనతో ఓ వైపు కాంగ్రెస్ ఎంపీలు.. మరోవైపు బీజేపీ, ఇతర పార్టీల ఎంపీలు మొదట బిత్తరపోయారు స‌భ‌లో చాలా మంది స‌భ్యులు లేని నిల‌బ‌డి ఏం జ‌రుగుతుందా అని ఆస‌క్తిగా గ‌మ‌నించారు.