వైసీపీలో చేరిన ర‌ఘురాజు ఎస్. కోట‌లో హుషారు

359

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బీజేపీకి గుడ్ బై చెప్పిన నాయ‌కుడు వైసీపీలో చేరారు.. ముందుగా ప్ర‌క‌ట‌న చేసిన విధంగానే ఆయ‌న జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతానికి బైక్ ర్యాలీగా వ‌చ్చి, పార్టీలో చేరారు.. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు బీజేపీలో చేరారు…విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో, ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు.

Image result for jagan padayatra

ఇక గ‌త మూడు రోజులుగా ఆయ‌న ఈ వారం పార్టీలో చేరుతారు అని వార్త‌లు వ‌చ్చాయి.. చివ‌ర‌కు ఆయ‌న నేడు జ‌గ‌న్ స‌మ‌క్షంలో త‌న అనుచ‌ర‌గ‌ణంతో పార్టీలో చేరారు.. ఆయ‌న‌తో పాటు దాదాపు 500 మంది పార్టీ కార్య‌క‌ర్త‌లు వైసీపీలో చేరారు. ఇక శృంగ‌వ‌ర‌పు కోట నుంచి 500 బైకుల‌తో ర్యాలీగా వీరంద‌రూ పెందుర్తికి వ‌చ్చారు.

Image result for jagan padayatra
వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుకి త‌ప్ప‌కుండా మ‌నం కృషి చేయాల‌ని, జ‌గ‌న్ ని సీఎం చేసే వ‌ర‌కూ పోరాటం ఆప‌మ‌ని తెలియ‌చేశారు నాయ‌కులు.. జ‌గ‌న్ సీఎం అవుతారు అని, ఆయ‌న్ని సీఎం చేసే వ‌ర‌కూ అవిశ్రాంతంగా శ్ర‌మిస్తామ‌ని అన్నారు..ఎస్ కోట‌లో వైసీపీ జెండా ఎగురుతుంది అని ఆయ‌న‌కు ఇక్క‌డ సెగ్మెంట్ కానుక‌గా ఇస్తామ‌ని తెలియ‌చేశారు ర‌ఘురాజు.