టీడీపీ కొత్త పాయింట్ చెప్పిన పురందేశ్వ‌రి

446

తెలుగుదేశం ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో బీజేపీ నాయ‌కులు మరింత సిద్ద‌హ‌స్తులు అవుతున్నారు.. ముఖ్యంగా బీజేపీ త‌ర‌పున నాయ‌కులు తెలుగుదేశం పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.. ఇప్పుడు అంతా? మ‌హారాష్ట్రలో ధ‌ర్మాబాద్ కోర్టు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈవిష‌యంలో బీజేపీ పై విమ‌ర్వ‌లు చేస్తున్నారు టీడీపీ నేత‌లు.. వీటిని తిప్పికొట్ట‌డంలో ముందు ఉంటున్నారు బీజేపీ నేత‌లు, తాజాగా ఈ వివాదం పై పురంద‌రేశ్వ‌రి స్పందించారు.

Image result for purandeswari

ఈ అరెస్ట్‌ వారెంట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై 2010లో కేసు నమోదైతే.. బీజేపీని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. ఏం జరిగినా టీడీపీ నేతలు కేంద్రానికి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు వచ్చిన నోటీసులపై అక్కడి ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు.. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యనించడం సరికాదని అన్నారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ అధికారంలో ఉంది ఎవ‌రు, ఎనిమిది సంత్స‌రాల నుంచి కోర్టు త‌ర‌పున నోటీసులు రాలేదు అంటే అక్క‌డ వారిని ప్ర‌శ్నించాలి అని ఆమె తెలియ‌చేశారు.

Image result for chandra babu sad face

ఇంకా ఆమె మాట్లాడుతూ.. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని దానిని తామే పూర్తి చేస్తామని వెల్లడించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపులో అన్యాయం చేయలేదని తెలిపారు. సాంకేతికపరమైన అంశాల వల్ల కొంత జాప్యం జరిగి ఉండవచ్చని అన్నారు. అంతర్గతంగా చర్చించుకుని బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి మ‌రింత పార్టీని మీరు దిగ‌జార్చుకుంటున్నారు అని ఆమె విమ‌ర్శించారు.. ఇక తెలుగుదేశం పార్టీ కావాల‌నే బీజేపీపై అప‌వాదులు చేస్తోంద‌ని ఈ విష‌యంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేద‌ని ఆ రాష్ట్రంలో వారిని ప్ర‌శ్నించాలి అని ఆమె తెలియ‌చేశారు.