వైఎస్ వివేకా హత్యకేసులో పులివెందుల సీఐ సస్పెన్షన్

308

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ అనుమానిస్తున్న ఆయన అనుచరులపై దృష్టిపెట్టింది. వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గంగిరెడ్డితో పరమేశ్వర్‌రెడ్డి చేతులు కలిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులోని ఓ భూవివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రూ.125 కోట్ల సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ డీల్‌లో రూ.1.5 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తోంది. గత నాలుగు రోజులుగా గంగిరెడ్డిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందే రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇంటి ద‌గ్గర అనుమానితుల సంచారం జ‌రిగిందా అనే అనుమానం కూడా బ‌ల‌ప‌డింది. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఇప్పటివరకు రకరకాల ఆధారాలు, కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా విచారణ జరుగుతూనే ఉంది.

Image result for ys vivekananda reddy daughter

అయితే వివేకానందరెడ్డి హత్యకేసులో పోలీసులకు షాక్ తగిలింది. హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు విపరీతంగా ప్రయత్నిస్తుండగా మరోవైపు పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలంలో ఆధారాలు కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ అర్బన్ సీఐ శంకరయ్యను సస్పెండ్ చేశారు. డీఐజీ నాగేంద్రకుమార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య జరిగిన వెంటనే రక్తపు మరకల్ని కడిగేయడంలో కీలకమైన ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గిపోయామని పోలీసు శాఖ భావిస్తోంది. అంతకుముందు వైసీపీ నేత అవినాష్ రెడ్డి తీరు పట్ల కూడా సీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

పులివెందులలో సొంత నివాసంలోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ముందుగా ఆయనది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం హత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. వివేకానంద రెడ్డి ఒంటిపై ఏడు చోట్ల కత్తితో పొడిచిన గాయాలనున్నట్లు స్పష్టమైంది. తల వెనుక భాగంలో బలమైన గాయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నుదుటిపై రెండుచోట్ల లోతైన గాయాలున్నాయని ఛాతీ, చేతి వేళ్లపైనా గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో వివేకా హత్యపై సిట్‌తో దర్యాప్తు ప్రారంభించారు. చూడాలి మరి ఈ కేసు ఎప్పటికి తేలుతుందో. మరి వివేకా హత్య గురించి సిఐ సస్పెన్షన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.