కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి

403

డిఎంకె అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..ఈ రోజు ఆయనను భారత రాష్ట్రపతి రాం నాథ్ కోవిండ్ పరామర్శించారు..చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న కావేరి ఆస్పత్రికి వెళ్లిన రాష్ట్రపతి.. కరుణానిధి ఆరోగ్యంపై ఆయన తనయుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళి, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతితో పాటు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఉన్నారు.

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిరోజుల కిందట కరుణానిధి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యం కుదుటపడిందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది.