ఇద్ద‌రికి సెటిల్ చేసిన జ‌గ‌న్

270

తూర్పుగోదావ‌రిలో తెలుగుదేశం అధికారంలో ఉంది.. ఇటు వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉంది… కాని వైసీపీ నుంచి విమ‌ర్శ‌ల జోరు టీడీపీ మీద కాకుండా వైసీపీ మీదే పెరుగుతోంది… సెగ్మెంట్ల‌లో వ‌ర్గ‌పోరు ఇటు వైసీపీలో కూడా మితిమీరిపోతోంది..తాజాగా ప్ర‌త్తిపాడు వైసీపీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డారు.. దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇరువురు నేత‌ల‌కు క్లాస్ తీసుకున్నారు అని తెలుస్తోంది.. గ‌తంలో ఇలా వివాదాలు వద్దు అని ప‌లు సెగ్మెంట్ల‌లో పాద‌యాత్ర‌కు ముందు చెప్పినా ఇలా వివాదాలు ఎందుకు వ‌స్తున్నాయి అని జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు అని తెలుస్తోంది.

Image result for jagan

ప్రత్తిపాడు వైసీపీలో వర్గ విభేదాలు కొద్దిరోజులుగా వ‌స్తూనే ఉన్నాయి…తాజాగా ముర‌ళీరాజు , పర్వతప్రసాద్‌లను జగన్‌ తన శిబిరం వద్దకు పిలిచి క్లాస్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది …కత్తిపూడి క్రాస్‌రోడ్డు నుంచి జరిగిన పాదయాత్రలో మురళీరాజు మేనల్లుడుపై పర్వత ప్రసాద్‌ చేయి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వాకబు చేసిన జగన్ వీరిద్ద‌రిని కుర‌సాల క‌న్న‌బాబు స‌మ‌క్షంలో వివాదాలు వ‌ద్దని కూర్చొబెట్టారు అని తెలుస్తోంది.

ఇరువర్గాలు విభేదాలు వీడి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించినట్లు తెలిసింది. మురళీరాజు ఏర్పాటు చేసిన ప్రచార బెలూన్‌లపై కో-ఆర్డినేటర్‌ ప్రసాద్‌ ఫొటో లేకపోవడంపై ఆయన్న ప్రశ్నించినట్లు తెలిసింది.. జగన్‌ క్లాస్‌తో విభేదాలు లేకుండా ఇద్దరూ చెరోపక్కన ఉండి పాదయాత్ర సాగించారు. మొత్తానికి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ఇలా వివాదాలు రావ‌డం పై వైసీపీలో కాస్త నైరాస్యం వ‌చ్చింది.