పోలింగ్ ముగిసిన 24 గంటల్లో ప్రశాంత్ కిషోర్ అద్భుత విశ్లేషణ.. సంబరాలు చేసుకుంటున్న వైసీపీ

302

నిన్న ఏప్రియల్ 11 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ తో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి..ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీలు పొటీ పడ్డాయి..ఉదయం 7 గంట్లకు ప్రారంభమయిన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో సగటున 76.69 శాతం పోలింగ్‌ జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 71.43 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు ఓటింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే ఫలితాలు కూడా విడుదలయ్యాయి..ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం ఏపిలో వైసిపి ప్రభంజనం ఉందనుందని తెలుస్తోంది..ఏపిలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంటు స్థానాల్లో వైసిపి ఎక్కువగా గెలిచే అవకాశం ఉందని పీకె సర్వే స్పష్టం చేసింది..

ఈ క్రమంలో 25 ఎంపి సీట్లకు గాను వైసిపి 20 ఎంపి సీట్లు గెలిచే అవకాశం ఉందని అలాగే 175 అసెంబ్లీ సీట్లకు గాను 125 నుంచి 140 సీట్లు గెలిచే అవకాశం ఉందని పీకె సర్వే అంచనా వేసింది..అనేక స్థానాల్లో వైసిపి మెజారిటీ విషయంలో కూడా వైసిపి దూసుకుపోతుందని పీకె సర్వే స్పష్టం చేసింది..ఇక తెలుగుదేశం పార్టీకి 25 నుంచి 35 సీట్లు 5 ఎంపిలు వచ్చే అవకాశం ఉందని పీకె సర్వే తేల్చేసింది..అలాగే జనసేనకు 5 నుంచి 10 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎంపి సీట్లు మాత్రం జనసేన ఖాతా తెరవదని పీకె సర్వే స్పష్టం చేసింది..

అలాగే బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఏపిలో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఆ సర్వే తేల్చేసింది..ఇక ఈ ఎన్నికల్లో కొందరు మహామహులు ఓడిపోవడం ఖాయమని పీకె సర్వే అంచనా వేసింది..మంగళగిరిలో లోకెష్ ఓటమి ఖామని భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోనున్నారని గాజువాక లో అతికష్టం మీద గట్టెక్కే అవకాశం ఉందని పీకె సర్వే అంచనా వేసింది..అలాగే కుప్పం లో చంద్రబాబు నాయుడు గెలుపు కూడా అంత ఈజీ కదని పీకె సర్వే తేల్చేసింది..