ప్రముఖ నేత మాజీ ఎంపి చెన్నుపాటి విద్య కన్నుమూత…విషాదంలో రాహుల్ రఘువీరా

342

ప్రముఖ మహిళా నేత మాజీ ఎంపి చెన్నుపాటి విద్య ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్ను మూశారు..గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు..ఆమె వయసు 84 సంవత్సరాలు..ఆమెకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు..సమాజంలో వేళ్లూనుకున్న మూఢ నమ్మకాలు, అంధ విశ్వసాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు కృషి చేసిన సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తే విద్య. విద్య విజయనగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1950లో విజయవాడకు చెందిన చెన్నుపాటి శేషగిరిరావును వివాహం చేసుకున్నారు.

వాసవ్య మహిళా మండలి స్థాపన సమయంలో అష్టకష్టాలూ పడాల్సి వచ్చినా, ఆ తరువాత ఆమె ఎక్కిన ప్రతి మెట్టూ విజయం వైపే పడింది. వాసవ్య మహిళా మండలి ద్వారా మహిళా సంక్షేమం, అభ్యుదయానికి ఎంతో కృషి చేశారు. తన తండ్రి నుంచి అభ్యుదయ భావాలను, క్రమశిక్షణను అలవర్చుకున్నట్టు విద్య పలుసార్లు చెప్పారు. నాన్న గారి సలహా మేరకే మహిళా మండలిని ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పేవారు. విద్య సేవలను గుర్తించిన ఇందిరాగాంధీ 1979లో తొలిసారి పార్లమెంట్‌ ఎన్నికల కోసం విజయవాడ టిక్కెట్‌ను విద్యకు కేటాయించారు. 1980 నుంచి 1984 వరకు మొదటిసారి, 1989 నుంచి 1991 వరకు రెండోసారి లోక్‌సభ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తించారు. 1934 జూన్‌ 5న జన్మించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. చెన్నుపాటి శేషగిరి రావును 1950లో వివాహం చేసుకున్నారు. విద్యకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విద్య అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు.