పోలింగ్ తరువాత మంగళ గిరిలో కొడుకు లోకేష్ పరిస్థితి తెలిసి చంద్రబాబుకు ఏం చేసాడో తెలిస్తే షాక్ ..

221

ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు అంద‌రి ఫోక‌స్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉంది. ఎందుకంటే ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ మొద‌టిసారిగా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుండి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దిగుతున్నాడు. న‌వ్యాంధ్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి అత్యంత ప్రాధానం ఏర్ప‌డింది. అమరావతికి మంగళగిరి ముఖ ద్వారంగా నిలిచింది. కాబ‌ట్టి ఇక్క‌డ గెలుపును ప్ర‌ధాన పార్టీల‌న్నీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున నారా లోకేష్ పోటీ చేస్తుండ‌గా.. వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి బ‌రిలో ఉన్నారు. జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకు కేటాయించగా, ఆ పార్టీ తరపున రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌ తరపున షేక్‌ సలీం పోటీలో ఉన్నారు.

లోకేశ్ ను రంగంలోకి దించడంతో మంగళగిరి గ్రూపు రాజకీయాలకు చంద్రబాబు చెక్ పెట్టారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంగళ గిరిలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2014 ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి ఓడిపోయారు. గెలిచిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి టీడీపీ నేతలకు తల నొప్పిగా మారారు. రాజధాని ప్రాంతంలో సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయం పై ఆయన కోర్టుకెక్కారు. లోకేశ్ ను రంగంలోకి దించడం ద్వారా ప్రత్యర్థిని ఓటమి, రాజ ధాని ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించ వచ్చని బాబు భావిస్తున్నారు…

రాజధాని ప్రాంతంలో బరిలో దిగడం ద్వారా వైసిసికి నేరుగా సవాల్‌ విసిరినట్టవు తుందని, ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహపర్చవచ్చనే వ్యూహమూ ఉందన్నారు. మరోవైపు అమరావతిని అభివృద్ధి చేయడంపైనే రాష్ట్రమంతటా ప్రచారం చేయాలనుకుంటున్న టిడిపి ఆ దిశలో బలమైన సంకేతాలకు ఇవ్వడానికే లోకేష్‌ను ఇక్కడి నుండి బరిలోకి దింపిందన్న అభిప్రాయమూ వ్యక్తమవు తోంది. లోకేష్‌ ఇక్కడ నుండి పోటీచేస్తే రాజధాని అభివృద్ధికి తమకున్న చిత్తశుద్ధిని రాష్ట్ర మంతా చెప్పుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలూ వస్తున్నాయి. గుంటూరు, కృష్ఱా జిల్లాలో టిడిపి అభ్యర్థుల విజయావకాశాలపై లోకేష్‌ పోటీ మరింత సానుకూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో కాంగ్రెస్‌ను మిన‌హాయిస్తే అంతా హేమాహేమీలే నిల‌బ‌డ‌టంతో విజ‌యం అంత సుల‌భం కాద‌న్న‌ది నిపుణుల మాట‌. ఇక్క‌డ టీడీపీ, వైసీపీ, సీపీఐ మూడు పార్టీలు బ‌లంగానే ఉన్నాయి. వైసీపీ త‌ర‌ఫున ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 12 ఓట్ల తేడాతో ఓట‌మిపాలైంది. మంగళ గిరిలో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగుసార్లు కమ్యూనిస్టులు విజ‌యం సాధించారు. ఆ పార్టీకి కూడా గ‌ట్టి ప‌ట్టు ఉంది. ఈ నేప‌థ్యంలో విజ‌యం ఎవ్వరికీ అంత సుల‌భం కాద‌ని నిపుణులు అంటున్నారు.

నాలుగు పార్టీల అభ్య‌ర్తులు పోటీలో ఉన్నా… ప్ర‌ధానంగా నారా లోకేష్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని నిపుణులు చెప్తున్నారు. ఓర‌కంగా ఈసారి జరుగుతున్న ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరుగా మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో వీరి అనుకూల‌త‌లు.. ప్ర‌తికూల‌త‌ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే..

 • నారా లోకేష్
  అనుకూల‌త‌లు
 1. ముఖ్య‌మంత్రి త‌న‌యుడు.
 2. టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే కీల‌క మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే అవకాశం.
 3. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితే లోకేష్ త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎక్కువ‌గా నిధులు తీసుకొచ్చే అవ‌కాశం.
 4. భ‌విష్య‌త్ ముఖ్య‌మంత్రిగా కీర్తింప‌బ‌డ‌టం.
 5. బ‌ల‌మైన టీడీపీ క్యాడ‌ర్‌.

ప్ర‌తికూల‌త‌లు

 1. టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగ‌ప‌డిన నేత‌లు అసంతృప్తితో ఉన్నారు. ఇప్ప‌టికే ఒక‌రిద్ద‌రు ముఖ్య‌నాయకులు వైసీపీకి వెళ్లిపోయారు.
 2. లోకేష్ ప్ర‌చార శైలి. ఆయ‌న త‌రుచూ త‌డ‌బ‌డుతుండం. వాగ్ధాటి పెద్ద‌గా లేక‌పోవ‌డం.
 3. సిట్టింగ్ ఎమ్మెల్యే వ్య‌తిరేక ఓటును సీపీఐ, కాంగ్రెస్ చీల్చే అవ‌కాశం ఉండ‌టం.

అయితే లోకేష్ గెలుపుకు చంద్రబాబు పకడ్బందీ వ్యూహం రచించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి..అయితే అక్కడి ఓటర్లను లోబరచుకునేందుకు భారీ ఎత్తున రూ 300 కోట్లు ఖర్చు పెట్టారని ప్రతిపక్ష వైసిపి ఆరోపిస్తోంది..ఎన్నికల ముందువరకూ వైసిపి అభ్యర్ది ఆళ్ళ రామకృష్నా రెడ్డి గెలుస్తారనే వార్తలు వెలువడ్డాయి..కానీ ఎన్నికలు అయిన తరువాత పరిస్థితులు తారుమారు అయినట్టు తెలుస్తోంది.. మనగళగిరిలో లోకెష్ పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి..