టీడీపీ మ‌హిళా ఎమ్మెల్యేపై అస‌భ్య‌ పోస్టులు రంగంలోకి పోలీసులు

383

సోష‌ల్ మీడియాలో మ‌రింత వ‌ల్గ‌ర్ గా రాజకీయంగా విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. దీనికి అడ్డుక‌ట్ట వేయాలి అని చూస్తున్నా ఏపీలో తెలంగాణ‌లో ఇలాంటి ప‌రిస్దితి క‌నిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేలు ఇంచార్జ్ లు మంత్రుల‌పై ఇష్టం వ‌చ్చిన రీతిలో కామెంట్లు వ‌స్తున్నాయి పోస్టులు పెడుతున్నారు.

Image result for chandra babu

పామ‌ర్రులో సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు కథనాలు పోస్టు చేయడంతో పాటు మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు గురి చేసే పోస్టులు పెడుతున్న ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్థానిక యాదవపురానికి చెందిన గొరిపర్తి నాగబాబు ఆగస్టు 21వ తేదీన సోషల్‌ మీడియా ద్వారా ఎమ్మెల్యేనుద్దేశించి నీవు చీరలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తావని తెలియక రాజు అన్న నీకు సహాయం చేసినట్టు పోస్టులు పెట్టాడన్నారు.

Image result for tdp

ఇంకా ఆడ ఊసరవెల్లి ఇక్కడ రంగు మార్చింది, పార్టీలు మారిందని… ప్లాష్‌ న్యూస్‌… తప్ప తాగి దొరికిపోయిన ఫోటోతో చిక్కిన మహిళ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే పామర్రు వచ్చేయండి అని, అలాగే సెప్టెంబరు 23న మళ్లీ మన పామర్రులో మావోయిస్టులు లేరు కదా అవినీతి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండండి మీ మేలు కోరి చెబుతున్నాం అంతే, అరకు ఘనటతో పామర్రు ఫిరాయింపు ఎమ్మెల్యే ముఖ చిత్రం మారిందట, అరకు దాకా వచ్చిన మీరు అమరావతికి రాకపోవడమేంటి అన్నలూ… ఈట్‌ ఈజ్‌ వెరీ దారుణం, ఓపాలొచ్చి పొవచ్చుగదా అంటూ పోస్టులు పెట్టారన్నారు..ఇలా భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసేలా పోస్టులు పెడుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి అని ఆమె కోరారు, దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు