కోడెల మొబైల్ మాయం పోలీసుల అనుమానం నిజం అవుతుందా

262

ఏపీ మాజీ స్పీక‌ర్ కోడెల మృతిపై అనేక అనుమానాలు వ‌స్తున్నాయి.. ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొంద‌రు మంత్రులు కూడా ఇది ముందు ఆత్మ‌హ‌త్య కాదు అని త‌ర్వాత హత్య అని కామెంట్లు చేశారు. మొత్తానికి పోలీసులు ఫైన‌ల్ గా చెప్పేసరికి వారు కూడా ఇది ఆత్మ‌హ‌త్య అని ఒప్పుకున్నారు. అయితే ఏం జ‌రిగినా వైసీపీ పై తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేస్తోంది అని, ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌ని కూడా రాజ‌కీయం చేస్తున్నారు అని అంటున్నారు వైసీపీ నేత‌లు.తాజాగా ఆయ‌న కేసుకు సంబంధించి పోలీసులు ప్ర‌తీది విచార‌ణ చేస్తున్నారు.. అందులో భాగంగా ఆయన ప‌ర్స‌న‌ల్ మొబైల్ మాయం అయింది అని పోలీసులు గుర్తించారు.. కోడెల చనిపోయే ముందు 24 నిమిషాల సమయం పాటు ఎవరితోనో మాట్లాడార‌ని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిన్న సాయంత్రం 5 గంటల తరువాత నుండి కోడెల మొబైల్ స్విఛాఫ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Image result for kodela siva prasad

కోడెల శివప్రసాద రావు నిన్న ఉదయం 8.30 గంటలకు 24 నిమిషాల సమయం పాటు, ఒకరితో ఫోనులో మాట్లాడారని పోలీసులు గుర్తించారు. ఐతే కోడెల ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు ? ఆ వ్యక్తితో కోడెల ఏం మాట్లాడారు? అనే విషయాలు దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కోడెల ఫోన్ నెంబర్ ఇన్ కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్, మెసేజ్ లను పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. పైగా ఉద‌యం నుంచి ప‌లువురు చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా కొన్ని పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.చంద్ర‌బాబుకి ఫోన్ చేసినా ఆయ‌నకు కాల్ క‌ల‌వ‌లేదు అని, లైన్ లోకి రాలేదు అని. త‌ర్వాత కోడెల ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు అని మంత్రి కొడాలి నాని కూడా విమ‌ర్శించారు.. ఈ స‌మ‌యంలో ప‌ర్స‌న‌ల్ ఫోన్ క‌నిపించ‌క‌పోవ‌డం పై పెద్ద ఎత్తున అనుమానాలు వ‌స్తున్నాయి.. క‌చ్చితంగా ఫోన్ వ్య‌వ‌హ‌రం తేల్చుతాము అంటున్నారు పోలీసులు. ముఖ్యంగా ఈ ఫోన్ ఎవ‌రైనా దాచేశారా అనే అనుమానం మాత్రం చాలా మందికి వ‌స్తోంది.

ఈ క్రింద వీడియో చూడండి

అలాగే పోలీసులు కోడెల ఆత్మహత్యకు గల కారణాలను కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. కోడెల నివాసంలో వేలిముద్రలను క్లూస్ టీం ఇప్పటికే సేకరించింది. కోడెల కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లిఖితపూర్వకంగా నమోదు చేయటంతో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడెల వ్యక్తిగత మొబైల్ ఎవరి దగ్గర ఉంది ? కేసులో కీలకంగా వ్యవహరించే ఈ మొబైల్ ఫోన్ ను ఎవరైనా కావాలని దాచేశారా ? 5 గంటల సమయం వరకు ఆఫ్ కాని మొబైల్ ఆ తరువాత ఎందుకు స్విఛాఫ్ అయింది అనే ప్రశ్నలకు ఆ ఫోన్ ఎక్కడుందో తెలిస్తే మాత్రమే సమాధానాలు లభిస్తాయి. పోలీసులు ఇప్పటికే కోడెల ఆత్మహత్యకు పాల్పడిన వైరును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రి కోడెల ఆత్మహ‌త్య కేసుపై పోలీసులు ఏం తేలుస్తారో.