కోడెల చివ‌రి కాల్ ఎవ‌రికో తెలిసింది కీల‌క విష‌యాలు తెలుసుకున్న పోలీసులు

987

మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కోడెల మృతిపై పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది.. కోడెల కేబుల్‌ వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. కొంతకాలంగా కోడెల వాడుతున్న మందులను స్వాధీనం చేసుకున్నారు.

Image result for kodela siva prasad

కోడెల చివరిగా కేన్సర్‌ ఆస్పత్రి వైద్యురాలికి ఫోన్‌ చేసినట్లు కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు. అయితే ఆ కాల్ సారాంశం ఏమిటి ఆయ‌న ఏమి మాట్లాడారు అనేది డాక్ట‌ర్ ని అడిగి తెలుసుకోనున్నారు.ఇతర కాల్స్‌ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కోడెల భార్య, కూతురు, గన్‌మన్‌, డ్రైవర్‌తోపాటు.. మరో నలుగురిని ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులసహా 12 మందిని విచారించి వారి వాంగ్మూలం రికార్డు చేశారు. కోడెల అంత్యక్రియల నిమిత్తం కొంతమంది నరసరావుపేటకు వెళ్లారని.. తిరిగొచ్చిన తర్వాత వారిని కూడా విచారిస్తామని బంజారాహిల్స్‌ ఏసీపీ అన్నారు. కోడెల ఆత్మహత్యతో ఆయన కుమారుడు శివరామకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కాగా.. కోడెల మృతి అనుమానాస్పదమని, రాజకీయ కక్ష అని కూతురు విజయలక్ష్మీ ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

అలాగే కోడెల ఆత్మహత్య కేసులో ఆయ‌న వాడిని మొబైల్ ఫోన్ దొరికిన తర్వాత కాల్ డేటా విశ్లేషిస్తామన్నారు. కోడెల మేనల్లుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు తమకు ఫ్యాక్స్ ద్వారా అందిందని, ఆ కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. అతని ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది వాంగ్మూలం సేకరించినట్లు తెలిపారు. కోడెల తనయుడు, సన్నిహితులను ప్రశ్నించాల్సి ఉందని, ఆత్మహత్యకు ముందు ఎవరితోనైనా మాట్లాడారనేది తెలియాల్సి ఉందన్నారు. ఓ ప‌క్క కోడెల కుమార్తె తెలుగుదేశం నేతలు ప్ర‌భుత్వ క‌క్ష‌సాధింపు వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని అంటున్నారు.. మ‌రో ప‌క్క కోడెల మేన‌ళ్లుడు మాత్రం కోడెల కుమారుడి వ‌ల్ల ఆయ‌న ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు అంటున్నారు.. మొత్తానికి పోలీసుల విచార‌ణ‌లో నిజా నిజాలు తేలాల్సి ఉంది.