వైయ‌స్ ఆర్ గురించి సంచ‌ల‌న నిజాన్ని బ‌య‌ట‌పెట్టిన పోలీస్ ఆఫీస‌ర్

986

వైయ‌స్ఆర్ అంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికి అందుకే వైయ‌స్ ప్ర‌జ‌ల మ‌ధ్య లేక‌పోయినా ఆయ‌న ప‌థ‌కాలు ఇంకా నిలిచే ఉన్నాయి.. లీడర్ సినిమాలో అందరూ ఇష్టపడే ఒక సీన్ ఉంటుంది. అలాంటి సీన్‌ని రియల్ లైఫ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి నిరూపించి చూపించారంటే నమ్ముతారా? స్వయంగా ఒక పోలీస్ బాస్‌ ఈ విషయం చెప్పుకొచ్చాడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ విషయాన్ని ఒక డిఐజీ స్థాయి అధికారి అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం బీటు చూసిన ఒక సీనియర్ జర్నలిస్ట్‌తో పంచుకోవడం జరిగింది.

Image result for ysr

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ లో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగిన విషయం సంచలనం అయిన విషయం తెలిసిందే. ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడి చేసిన ముగ్గురు కుర్రాళ్ళను శిక్షించాలని తెలుగు ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకున్నారు. మీడియాలో కూడా బ్రేకింగ్ న్యూస్‌తో పాటు చర్చలు కూడా గంటలు తరబడి నడిచాయి. యాసిడ్ దాడి చేసిన వాళ్ళలో ఒక కుర్రాడు బాగా డబ్బు, పలుకుబడి ఉన్న కుర్రాడు. అయితేనేం ఆ టైంలో ఢిల్లీలో ఉన్న వైఎస్…….యాసిడ్ దాడికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒక డిఐజీ ద్వారా తెలుసుకున్నాడు. తాను చెప్పిన విషయం అంతా విన్న వైఎస్సార్ చలించిపోయాడని స్వయంగా ఆ డిఐజీనే చెప్పుకొచ్చాడు. వైఎస్ స్పందన తర్వాత ఆ డిఐజీకి కూడా ఏం మాట్లాడాలో తెలియలేదట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అప్పుడే వైఎస్ రాజశేఖరరెడ్డి…..ఎంతో భవిష్యత్ ఉన్న ఇద్దరు అమ్మాయిలపై అంత భయానకంగా దాడి చేయడమా? అమ్మాయిలకు మనం ఏం భరోసా ఇస్తున్నాం? ఆ యాసిడ్ దాడి చేసిన వాళ్ళని మనం ఏమీ చెయ్యలేమా అని అడిగాడట. వైఎస్ రాజశేఖరరెడ్డి మాటల్లోనే ఆయన ఎమోషనల్ రియాక్షన్‌ని ఆ డిఐజీ అర్థం చేసుకున్నాడట.. ఆ తర్వాత ఆ ముగ్గురు యువకులు కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. వైఎస్ సిఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బీటు చూసిన ఒక నంబర్ ఒన్ పత్రిక జర్నలిస్ట్ తాజాగా ఈ విషయాన్ని తన తోటి సీనియర్ జర్నలిస్టులతో షేర్ చేసుకున్నాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి పోలీసులు కూడా గొప్పగా చెప్పుకునేవాళ్ళని చెప్పుకొచ్చాడు ఆ జర్నలిస్ట్..మ‌రి చూశారుగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌య‌మే ఆ నాడు వారి ఎన్ కౌంట‌ర్ అని అంటారు. మ‌రి ఆయ‌న లీడ‌ర్ షిప్ పై ఆయ‌న పాల‌న‌పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.