కశ్మీర్ పని అయింది నెక్ట్స్ హైదరాబాద్ మోదీ హైదరాబాద్ ని ఏం చేయబోతున్నారో తెలుసా

499

ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాదు తమ టార్గెట్ నెక్ట్స్ పీవోకే అనే సంకేతాలు కూడా ఇస్తోంది భారత్, అయితే ఇలాంటి దూకుడు చూపించకపోతే కచ్చితంగా, ఇక మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం అని మోదీ సర్కారు ఆలోచించింది, అసలు తమకు దైర్యం లేదు అనుకునేవారి పీచం అణిచివేయాలని చూస్తోంది బీజేపీ, అందుకే పాక్ కు సరైన జవాబు చెప్పాలని చూస్తోంది.. మహా అయితే దాడులు చేయడానికి సిద్దం అవుతారు. కాని ఆ దాడులు ఆపేలా తమ సైన్యంతో నిలువరించాలని చూస్తోంది బీజేపీ, అందుకే లక్షన్నర మంది సైన్యం మొత్తం మొహరించారు.. కశ్మీర్ ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు, అగ్రరాజ్యం కూడా ఎలాంటి మాట మాట్లాకుండా చేశారు, మొత్తానికి పాక్ ని ఈ అంశంలో కూడా నిట్టనిలువునా నిలబెట్టేశారు.

Image result for kashmir

ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ ను రెండు ముక్కలు చేసింది బీజేపీ. ఇక కశ్మీర్ రెండు రాష్ట్రాలే కాదు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా.. సో అక్కడ అధికారమంతా కేంద్రంలోని బీజేపీదే.. మరి బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటనే ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దానికి కూడా పార్లమెంట్ వేదికగా సమాధానం చెప్పారు అమిత్ షా..అయితే మరికొందరు వాదన వేరుగా వినిపిస్తోంది. కశ్మీర్ తర్వాత బీజేపీ టార్గెట్ హైదరాబాదేనన్న చర్చ ఇప్పుడు బీజేపీలో సాగుతోంది. మరి హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ ఏం చేయబోతుందన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.

Image result for hyd

రెండోసారి అఖండ మెజార్టీతో గద్దెనెక్కిన మోడీ సర్కారు కేవలం 100 రోజుల్లో ఇంత దూకుడుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్యలను పరిష్కరిస్తూ అందరినీ హడలెత్తిస్తోంది. రావణ కాష్టంలా రగిలే కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి భారత్ లో సంపూర్ణ విలీనం చేసి పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవరినీ నోరెత్తకుండా చేసింది. ఇప్పుడు కశ్మీర్ పని అయిపోయింది. మరి నెక్ట్స్ హైదరాబాద్ పై ఫోకస్ చేశాయట బీజేపీ శ్రేణులు..

Image result for kashmir

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని అమిత్ షా జమ్మూకశ్మీర్ విభజన బిల్లు సందర్భంగా మాట్లాడుతూ ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారమే ఏ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి లేకుండా ఆర్టికల్ 370 రద్దు చేశామని ప్రకటించారు. ఒకటే దేశం.. ఒకటే చట్టాన్ని అమలు చేశామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే అంబేద్కర్ చెప్పిన దేశ రెండో రాజధాని అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకురావడానికి రెడీ అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Related image

ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ ఇప్పుడు రాజకీయ కోణంలో హైదరాబాద్ ను టార్గెట్ చేసినట్టు సమాచారం. అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినట్టు దక్షిణాదిన దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దక్షిణాదిలో బీజేపీ బలపడడానికి ‘హైదరాబాద్’ రెండో రాజధాని అంశం బాగా కలిసి వస్తుందని.. అంతేకాక ఉత్తరాది ప్రభావాన్ని దక్షిణాదిలో తగ్గించడానికి.. దక్షిణాది ప్రజలను సంతృప్తి పరచడానికి ఈ ఎత్తుగడ పనిచేస్తుందని మోడీ సర్కారు భావిస్తోందట.. తెలంగాణ – ఏపీ – తమిళనాడు – కేరళలో బీజేపీ బలపడి ప్రజలకు సాన్నిహిత్యం కావడానికి దేశ రెండో రాజధానిగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ అంశాన్ని బీజేపీ ఇప్పుడు తెరపైకి తీసుకొస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఇలా సాగితే పరిపాలన పరంగా కేంద్రం హస్తం ఉంటుంది.

ఈ క్రింద వీడియో చూడండి

అంతేకాదు ఇక్కడ రాష్ట్రం కొన్ని అధికారాలను కోల్పోతుంది అంటున్నారు రాజకీయ మేధావులు, అయితే బీజేపీ బలపడటానికి ఇది బలమైన కారణంగా మారుతుంది.. కాని ఎలాంటి ఉపద్రవాలు జరగకుండా ఇక్కడ పోలీసులు ఆర్మీ కూడా పెద్ద సంఖ్యలో పనిచేయాల్సి ఉంటుంది.. పలు ప్రభుత్వ కార్యాలయాలు కేంద్రంలో ఉన్న అన్నీ ఆఫీసులు రెండో రాజధాని అయితే హైదరాబాద్ లో నిర్మించాల్సి ఉంటుంది, అయితే కల్చర్ డవలప్ మెంట్లో హైదరాబాద్ దేశంలో టాప్ స్టేజ్ లో ఉంది… అందుకు కారణం వివిధ రాష్ట్రాల వారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి, మరీ బీజేపీ రెండో రాజధాని అంశం తీసుకువచ్చి హైదరాబాద్ ని చేస్తే మరో మకుటం హైదరాబాద్ కు వస్తుంది అని చెప్పాలి.. మరి కేంద్రం తీసుకునే నిర్ణయం పై మీరేమంటారు దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి.