ప్లీజ్ మాకు స‌పోర్ట్ చేయండి – వైసీపీ

380

రాజ‌కీయాలు ఏ పార్టీలు చేస్తున్నాయో, అలాగే ప్ర‌జా సేవ ఏ పార్టీలు చేస్తున్నాయో అంత సుల‌భంగా తెలియ‌డం లేదు.. ఏపీ రాజ‌కీయాల్లో మ‌రింత వైష‌మ్యం రాజ‌కీయంగా కనిపిస్తోంది.. ఓ ప‌క్క ప్ర‌త్యేక హూదా ముసుగు ఇరు పార్టీలు వేసుకుని మ‌మ్మ‌ల్ని ఇరికిస్తున్నాయి అని బీజేపీ అంటోంది.. అస‌లు ఇచ్చేది బీజేపీ- ఈ గొడ‌వ‌కు పుల్ స్టాప్ పెట్టాల్సింది బీజేపీ.. కాని ఎలాంటి ప‌ని చేయ‌డం లేదు బీజేపీ… అయితే తెలుగుదేశం వెర్ష‌న్ ఎలా ఉన్నా ఇప్పుడు వైసీపీ కూడా క్రియాశీల‌కంగా మాట్లాడుతోంది.

Image result for ycp and tdp flags

వ‌క్ర‌భాష్యాలు చెప్పే పార్టీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌రు అనేది ఈనాటి నాయ‌కులు బాగానే అండ‌ర్ స్టాండ్ చేసుకున్నారు.. ఇక వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు, ఆ రాజీనామాలు ఆమోదించేలా చేసుకున్నారు.. దీంతో వైసీపీ నాయ‌కులు కోరేది తెలుగుదేశం నాయ‌కుల‌ని ఒక‌టే మాట… ఏపీకి ప్ర‌త్యేక హూదా కావాలి అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు రాజీనామాలు చేయాలి అని కోరుతున్నారు… తాజాగా 25 మంది ఎంపీలు ఏపీ కోసం క‌ష్ట‌ప‌డి కేంద్రంతో పోరాడి, ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధిద్దాం అని పిలుపునిస్తున్నారు.

Related image
వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు తాజాగా ఈ కామెంట్ చేశారు. టీడీపీ కూడా మాతో క‌లిసి ముందుకు రావాల‌ని ఈ ఉద్యమంలో పాల్గొనాల‌ని ఆయ‌న అన్నారు.. రేపు వైసీపీ త‌ల‌బెట్టిన బంద్ కు అన్ని పార్టీలు స‌హ‌క‌రించాలి అని కోరారు.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌లిసి ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు అని ఆయ‌న విమ‌ర్శించారు… గ‌తంలో ప్ర‌త్యేక హూదా ఉద్య‌మంలో ఎవ‌రు పోరాటం చేసినా, వైసీపీ స‌హ‌క‌రించింది.. ఇప్పుడు ఉద్యోగ వ్యాపార‌స్దులు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, బంద్ ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరుకుంటున్నారు. అదీఅస‌లు సంగ‌తి