YS వివేకానందరెడ్డి చనిపోయే ముందు జగన్ కి ఫోన్ చేసి ఏం చెప్పాడో తెలిస్తే షాక్

284

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైఎస్ వివేకాకు ఒక కుమార్తె ఉంది. వైఎస్ వివేకా ఆగస్ట్ 8, 1950న ఆయన జన్మించారు. వైఎస్ వివేకానందరెడ్డి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన గతంలో కడప లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేశారు. పులివెందుల నుంచి 1989, 1994లో వైఎస్ వివేకా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Image result for jagan

వైఎస్ మరణానంతరం ఏర్పడిన కిరణ్ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం విభేదాలకు స్వస్తి పలికి కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తరపున ఆయన పులివెందులలో నిన్న ప్రచారం కూడా చేసినట్లు తెలిసింది. ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని మార్చి 3వ తేదీన వైఎస్ వివేకా పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆయన హఠాన్మరణంతో జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హుటాహుటిన లోటస్‌పాండ్ నుంచి పులివెందులకు జగన్ కుటుంబ సభ్యులు బయల్దేరారు.

Image result for ys vivekananda reddy dead body

ఇక జ‌గ‌న్ కు ఆయ‌న బాబాయ్ అంటే చాలా ఇష్టం ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో స‌న్నిహిత సంబంధాలు ఉండేవి రాజ‌కీయంగా కొంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా స‌రే ఆయ‌న వైయ‌స్ జ‌గ‌న్ కు ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు అలాంటిది బాబాయ్ మ‌రో నెల‌రోజుల్లో ఎన్నిక‌లు ముగిసి తాను సీఎం అయ్యే అవ‌కాశం ఉన్న స‌మ‌యంలో చ‌నిపోవ‌డంతో షాక్ అయ్యారు, ఇక నిబ్బ‌రంగా క‌నిపించే జ‌గ‌న్ కు ఒక్క‌సారిగా క‌ళ్లుచెమ్మ‌గిల్లాయి అని వైయ‌స్ స‌న్నిహితులు చెబుతున్నారు. వైయ‌స్ కుటుంబంలో ఇప్పుడు పెద్ద అన్న‌గా ఉన్న ఆయ‌న రాజ‌కీయంగా పేరు సంపాదించారు అలాగే ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు పొందారు, అయితే ఆయ‌న‌ది స‌హ‌జ మ‌ర‌ణం అని అనుకున్న వారిక అంద‌రికి ఒక్క‌సారిగా పోలీసులు డాక్ట‌ర్లు షాకింగ్ వార్త చెప్పారు ఆయ‌న‌ది మ‌ర్డ‌ర్ అని ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేలింది సుమారు ఏడు క‌త్తిపోట్లు శ‌రీరంపై ఉండ‌టం గాయాలు ఉండ‌టంతో ఇది మ‌ర్డ‌ర్ అని తేల్చారు అయితే జ‌గన్ గ‌త రాత్రే వైయ‌స్ వివేకాతో ఫోన్లో మాట్లాడారు అని తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి 

 వైయ‌స్ వివేకానంద‌రెడ్డికి పులివెందుల జ‌మ్మ‌ల‌మ‌డుగు సెగ్మెంట్లో మంచి కేడ‌ర్ ఉంది అందుకే ఇక్క‌డ జ‌మ్మ‌ల‌మ‌డుగు వైసీపీ అభ్య‌ర్దిని గెలిపించే బాధ్య‌త బాబాయ్ కి జ‌గ‌న్ అప్ప‌గించారు, వైసీపీ త‌ర‌పున అభ్య‌ర్ది సుధీర్ రెడ్డిని ఈసారి గెలిపించాలి అని క‌డ‌ప‌లో మిగిలిన 9 సెగ్మెంట్ల‌లో ప్ర‌చారం నేను చెల్లి అమ్మ చూసుకుంటాము అని తెలియ‌చేశారు.. ఇక ఎన్నిక‌ల్లో పోటీ చేసే తొలి అభ్య‌ర్దుల లిస్ట్ విడుద‌ల చేసిన త‌ర్వాత ప్ర‌చారం మ‌రింత ముమ్మరం చేయాలి అని జ‌గ‌న్ బాబాయ్ కి ఫోన్లో తెలియ‌చేశారు కాని ఈ స‌మ‌యంలో ఇలాంటి దారుణం జ‌ర‌గ‌డంతో జ‌గ‌న్ షాక్ లో ఉన్నారు.