కూకట్ పల్లిలో సుహాసినికి దిమ్మతిరిగే షాక్

461

కుకట్ పల్లి నియోజకవర్గంలో చంద్రబాబునాయుడుకు తెల‌గుదేశం పార్టీకి ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. ఇక్కడ నుండి చివరి నిముషంలో పోటీలోకి దిగిన చుండ్రు అలియాస్ నందమూరి సుహాసినిని ఓటమి దాదాపు ఖాయమైపోయింది. సుహాసిని ఓడిపోవటం ద్వారా నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మ‌రోసారి మోసం చేయించారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి..తాజా సమాచారం ప్రకారం సుహాసిని 12 వేల ఓట్లతో వెనకబడ్డారు అని అంటున్నారు. అంటే ఓటమి దాదాపు ఖాయమైనట్లే అనుకోవాలి. ఈ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని సుహాసినిని చంద్రబాబు రంగంలోకి దింపారు. అసలు ఈ నియోజకవర్గంలో నందమూరి కల్యాణ్ రామ్ ను పోటీ చేయించాలన్న చంద్రబాబు ప్లాన్ బెడిసికొట్టింది. దాంతో నందమూరి కుటుంబం నుండి లాభం లేదనుకుని రాజకీయంగా పార్టీ పరంగా సీనియర్ నేత అయిన చుండ్రు శ్రీహరి కోడలు సుహాసినిని పోటీకి ఒప్పించారు. దాంతో సుహాసిని కూడా పోటీలోకి దిగారు. అయితే, సుహాసిని నామినేషన్ వేసిన దగ్గర నుండి కూడా ఆమె గెలుపుపై ఎవరిలోను నమ్మకమైతే లేదు.

Image result for nandamuri suhasini

విచిత్రమేమిటంటే, సామాజికవర్గం పరంగా సుహాసిని విజయానికి పనిచేసిన వాళ్ళు కూడా అభ్యర్ధి గెలవదనే చెప్పారు. ఏదో మీడియాలో ప్రచారం ద్వారా చంద్రబాబు మ్యాజిక్ చేసి గెలుస్తుందేమో అన్న భ్రమలైతే కల్పించగలిగారు. కాకపోతే క్షేత్రస్ధాయిలో తీసుకుంటే ఓటర్లంతా అభ్యర్ధికి పూర్తి వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిపోయింది. దాదాపు 3.7 లక్షల ఓటర్లలో కాపులు, బిసిలు, బ్రాహ్మణులు, ఎస్సీ, ముస్లింలు, రెడ్డి సామాజక వర్గం ఓటర్లలో మెజారిటీ సుహాసినికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కారణం ఏమిటంటే, పై సామాజికవర్గం ఓటర్లందరికీ ఏపిలో రాకపోకలున్నాయి. ఏపిలో వారంతా బలమైన బంధుత్వాలు, కుటుంబసభ్యులను కలిగి ఉన్నారు. వారంతా ఏపిలో చంద్రబాబు పాలనపై మండిపడుతున్నారు. ఆ నేపధ్యంలో ఇక్కడ గనుక సుహాసినికి ఓట్లేస్తే ఏపిలో చంద్రబాబు పాలనకు మద్దతిచ్చినట్లవుతుందని భావించారు. అందుకనే ఇష్టం ఉన్నా లేకపోయినా టిఆర్ఎస్ కు ఓట్లేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక నందమూరి కుటుంబం విషయానికి వస్తే సుహాసిని తండ్రి దివంగత నేత నందమూరి హరికృష్ణ ను చంద్రబాబు ఎంతగా అవమానించారో అందరికీ తెలిసిందే. అవసరమైనపుడల్లా నందమూరి కుటుంబాన్ని ఫుల్లుగా వాడేసుకోవటం అవసరం తీరిపోగానే తీసి అవతలపారేయటం చంద్రబాబుకు బాగా అలవాటు. అందుకనే బతికున్న రోజుల నుండే హరికృష్ణతో పాటు కొడుకులు జూనియర్ ఎన్టీయార్, నందమూరి కల్యాణ్ రామ్ చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు అని కొంద‌రు ఆపార్టీ నేత‌లే విమ‌ర్శిస్తార‌ట‌. అందుకనే కుకట్ పల్లిలో పోటీ విషయంలో చంద్రబాబు ఉచ్చులో కల్యాణ్ రామ్ పడకుండా జాగ్రత్తపడ్డారు అని కొంద‌రు టీడీపీ నుంచి బ‌య‌టకు వ‌చ్చిన నేత‌లే అంటున్నారు.