ఓట్లు అడిగేందుకు వెళ్లిన కేసీఆర్ కుమార్తెకు షాక్ ఇచ్చిన జనం

403

తెలంగాణ ఎన్నిక‌ల వేళ ప్రచారాల‌తో రాజ‌కీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి.. ముఖ్యంగా తెలుగుదేశం కాంగ్రెస్ కూట‌మి రోడ్ షోల‌తో చంద్ర‌బాబుని, రాహుల్ గాంధీతో భారీ బ‌హిరంగ స‌భ‌ల‌తో ప్రచారం హీటెక్కిస్తున్నారు. మ‌రో ప‌క్క సీఎం కేసీఆర్ ప్ర‌జా ఆశీర్వాధ స‌భ‌ల త‌ర‌హాలో ప్ర‌చారం చేస్తున్నారు .అలాగే కేటీఆర్ కూడా రోడ్ షోలు నిర్వ‌హిస్తున్నారు. ఇక మ‌హాకూట‌మికి టీఆర్ఎస్ కు ప్ర‌చారంలో వాడి వేడి మాట‌ల యుద్దం సాగుతోంది.ఈ స‌మ‌యంలో ప‌లువురి నేత‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు జ‌నాలు.. ముఖ్యంగా రోజులు మారాయి. రాజ‌కీయం మారిపోయింది. గ‌తంలో మాదిరి ఈసారి ప‌రిస్థితి అస్స‌లు లేదు. త‌మ మ‌న‌సులోని మాట‌ను చెప్పేందుకు సామాన్యులు ఏ మాత్రం సందేహించ‌టం లేదు. అగ్ర‌నేత‌లు ఎవ‌రైనా వ‌స్తే.. వారి విష‌యంలో గ‌తంలో ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించేవారు. వారిపై కోపం ఉన్నప్ప‌టికి గుండెల్లో దాచుకునే వారే కానీ ఓపెన్ కావ‌టానికి ఇష్ట‌ప‌డే వారు కాదు.

Image result for kavitha

ఇప్పుడు అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంది. త‌మ క‌డుపులో కోపం ఉంటే చాలు.. అప్ప‌టివ‌ర‌కూ మామూలుగా ఉన్న‌ట్లుగా క‌నిపించే వారు కాస్తా.. ఒక్క‌సారిగా మారిపోతున్నారు. కోపంతో ఊగిపోతూ.. గ‌తానికి సంబంధించిన అంశాల్ని ఏక‌రువు పెడుతూ తిట్ల దండ‌కాన్ని అందుకుంటున్నారు. తాజాగా ఈ త‌ర‌హా అనుభ‌వాన్ని తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె ఎంపీ క‌విత ఎదుర్కొన్నారు.
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె జ‌గిత్యాల జిల్లా బీర్ పూర్ మండ‌లం తాళ్ల ధ‌ర్మారం గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు మ‌హిళ‌ల నుంచి ఆమెకు నిర‌స‌న వ్య‌క్త‌మైంది. గ‌తంలో ద‌ళితుల‌కు భూ పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆమెను క‌ల‌వాల‌నుకున్న మ‌హిళ‌లు ప‌లువురిని పోలీసులు అడ్డుకోవ‌ట‌మే కాదు.. పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. ఆ చేదు అనుభ‌వాన్ని ఇప్ప‌టికీ గుర్తుంచుకున్న మ‌హిళ‌లు.. తాజాగా త‌మ‌కున్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒక‌ప్పుడు ఏ క‌విత‌ను అయితే తాము క‌లిసి విన‌తిప‌త్రం ఇవ్వాల‌నుకున్నారో.. ఆమెను క‌లుసుకునే ప్ర‌య‌త్నంలో పోలీస్ స్టేష‌న్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చిన వారిని చూసేందుకు.. వారి ఓట్లు అడిగేందుకు వ‌చ్చిన ఎంపీ క‌విత‌ను బాధిత మ‌హిళ‌లు తిట్లు.. శాప‌నార్థాల‌తో చెల‌రేగిపోయారు. భూములు పొందేందుకు అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ త‌మ‌కు అవేమీ రాకుండా చేసిన వైనంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. అందుకే.. క‌విత స్వ‌యంగా వ‌చ్చినా.. ఏ ముఖంతో ఓట్లు అడుగుతావంటూ చెల‌రేగిపోయారు. త‌మ‌కు రావాల్సిన భూములు ఇవ్వ‌కుండా.. ఇప్పుడేమో ఓట్లు వేయాల‌ని అడుగుతారా? అంటూ ఫైర్ అవుతున్నారు… మొత్తానికి ఈ ప్రచారంలో నిల‌దీయ‌డంతో అక్క‌డ టీఆర్ నేత‌లు వారికి స‌ర్దిచెప్పే ప‌రిస్దితి ఏర్ప‌డింది.ఇది టీఆర్ఎస్ పార్టీకే కాదు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల‌కు కూడా ఎదురు అవుతోంది అనేది రాష్ట్ర ప్ర‌చార ప‌ర్వంచూస్తే తెలుస్తుంది.