బాల‌కృష్ణ పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

498

టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, సినీ న‌టుడు నంద‌మూరి బాలయ్య‌పై ప‌రోక్షంగా జ‌న‌సేనాని సంచ‌ల‌న కామెంట్లు చేశారు.. ఆయ‌న జ‌న‌సేన పోరాట‌యాత్ర‌లో భాగంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు… ఆయ‌న‌కు కాలు బెణికినా ఆయ‌న రెస్ట్ తీసుకోకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు.. ఇటు వేలాది మంది అభిమానులు ఆయ‌న్ని క‌లిసేందుకు వ‌చ్చారు.. ఈ స‌మ‌యంలో పోలీసులు త‌మ‌ని ఇబ్బంది పెడుతున్నార‌ని చెప్పారు జ‌న‌సేన అభిమానులు.

Image result for jenasena pawan

తాము బైక్ సైలెన్స‌ర్ ని తీసివేసి శ‌బ్బం చేస్తే త‌ప్పు అంటున్నారని, ప‌వ‌న్ కి తెలియ‌చేశారు ఆయ‌న అభిమానులు.తమ పార్టీ కార్యకర్తలు బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని, తుపాకీతో కాల్చిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఈ అంశం టీడీపీకి ఆలోచ‌న‌కు గురిచేసింది.

Image result for balakrishna actor assembly

దీనిపై టీడీపీ కూడా విమ‌ర్శ‌లు చేస్తోంది… ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీనేతగా ఇలా కామెంట్లు చేయ‌డం త‌గునా అని విమ‌ర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు… ప‌వ‌న్ బాల‌య్య‌పై కావాల‌నే ఇలా విమ‌ర్శ‌లు చేశాడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు… .2004లో బాలకృష్ణ తన ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే… ఈ విష‌యం గురించే ఆయ‌న ప్ర‌స్తావించారు అనేది తెలుస్తోంది..ఇక తెలుగుదేశం ప్ర‌భుత్వం రైతుల నుంచి అన్యాయంగా అక్ర‌మంగా భూములు తీసుకుంద‌ని, వారిని అణిచివేసి వారి పొలాల‌ను తీసుకున్నారు అని, ఆ పొలాల‌తో తెలుగుదేశం నాయ‌కులు రియ‌ల్ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు అని విమ‌ర్శించారు జ‌న‌సేనాని.