మ‌క్కెలు ఇర‌గ‌దీస్తా ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

355

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈసారి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో చేస్తున్న యాత్ర తెలుగుదేశం వైసీపీ నాయ‌కుల‌కు కాస్త చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది అని చెప్పాలి.. మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ అధికార పార్టీ నాయ‌కుల‌పై ప‌వ‌న్ కాస్త ఫైర్ అవుతున్నారు.. అలాగే పార్టీ నాయ‌కులు కూడా ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు… జయప్రకాశ్‌ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ కొల్లేరుకు వచ్చినపుడు లేని ఆంక్షలు తాను వచ్చినపుడే ఎందుకు పెడుతున్నారని , ప‌శ్చిమ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ జనసేన అధినేత ప్రశ్నించారు.

Image may contain: 7 people, people smiling, people on stage and people standing
కొల్లేరులో యాత్రకు కట్టుబాట్లు విధించడంపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ మత్స్యకారులు అవినీతి రాజకీయ పార్టీల కుట్రల మధ్యలో నలిగిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయం చేస్తానని తానంటే ఇక్కడి నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే తన వద్దకు రావద్దని, రాకుండా కట్టుబాట్లు విధించారని ఆరోపించారు. ఇక్క‌డ‌కు జ‌న‌సేనాని వ‌స్తున్నారు అని తెలుసుకున్న స‌మయంలోనే అడ్డంకులు సృష్టించాలి అని అనుకున్నారు.

Image may contain: 1 person, beard, close-up and text

గత రాత్రి తనపై దాడి చేయడానికి కూడా వచ్చారని ప‌వ‌న్ తెలియ‌చేశారు.. తాను చేతులు కట్టుకుని కూర్చోనని, తన సంగతి తెలుసు కదా మక్కెలు ఇరగదీస్తానని హెచ్చరికలు పంపారు. తన మీద దెబ్బ పడేకొద్దీ తాను ఎదుగుతానే తప్ప తగ్గనని వ్యాఖ్యానించారు ప‌వ‌న్ క‌ల్యాణ్. తాను ముఖ్యమంత్రి అయితే రూ.110 కోట్లు పెట్టి కొల్లేరులో రెండు రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తానని పవన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొల్లేరు సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. త‌న వెనుక ఉంటే చాలు ఇక్క‌డ స‌మ‌స్య‌లు నేను తీరుస్తా అని ప‌వ‌న్ హామీ ఇచ్చారు. న‌న్ను సీఎంగా గెలిపించాలి అని నేను చెప్ప‌డం లేదు మంచిని ఎన్నుకోండి అని అన్నారు ప‌వ‌న్.