ఏపీలో రేప‌టి నుంచి ప‌వ‌న్ కొత్త కార్య‌క్ర‌మం

289

ఏపీలో జ‌న‌సేన త‌న దూకుడు పెంచింది అనే చెప్పాలి.. ఇప్ప‌టికే త‌న దూకుడు చూపిస్తున్న జ‌నసేనాని స‌రికొత్త కార్య‌క్ర‌మాల‌తో ముందుకు వెళుతున్నారు.. తాజాగా ఆయ‌న పార్టీ రేప‌టి నుంచి అంటే బుద‌వారం నుంచి తరంగం కార్యక్రమం చేపట్టనుంది. ..ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వివరాలు వెల్లడించారు. జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకే జనసేన తరంగం కార్యక్రమం చేపట్టినట్లు ఆయన అన్నారు. రేపు అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నుంచి ఈ తరంగం ప్రారంభమవుతుందని పవన్ పేర్కొన్నారు.

Image result for janasena

ఇక జ‌న‌సేన విన్నూత కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళుతోంద‌ని గోదావ‌రి జిల్లాల నుంచి రాయ‌ల‌సీమ ప్రాంతాల‌కు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు స‌రికొత్త కార్య‌క్ర‌మాల‌తో జ‌నాల‌ని ఆక‌ర్షిస్తున్నారు. అధికారం కాదు పోరాటంతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరుస్తా అని ప‌వ‌న్ చెబుతున్నారు..