లోకేష్ 60 ఏళ్లు వెయిట్ చెయ్ ప‌వ‌న్ స‌ల‌హా

346

తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఓ ప‌క్క చంద్ర‌బాబు అధికారంలో ఉన్నారు… 2050 వ‌ర‌కూ ఆయ‌నే సీఎం… ఆయ‌న త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు లోకేష్ సీఎం అని బీరాలు ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతున్నారు తెలుగుదేశం నేత‌లు అని వైసీపీ మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కూ విమ‌ర్శ‌లు చేసేది.. ఇప్ప‌డు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పొలిటిక‌ల్ స్టాండ్ స్ట్రైట్ గా తీసుకున్నారు… ఇక సీఎంల ప‌ద‌వి అంటే ఏదో ఆషామాషీగా ఉందా? అని జ‌న‌సేనాని కూడా చెబుతున్నారు..

Image may contain: 1 person, on stage, camera and beard

ఇక మంత్రి నారా లోకేష్ పై టార్గెట్ చేశారు నాయ‌కులు.. ముఖ్యంగా మంత్రిగా నారాలోకేష్ కు ఎలా ప‌ద‌వి ఇచ్చారు అని ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు ఇప్ప‌టికి… ఇక తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మంత్రి లోకేష్ కు సూచ‌న ప్రాయ‌మైన స‌ల‌హా ఇచ్చారు.నారా లోకేష్‌ బాబూ.. నువ్వ సీఎం కావాలంటే 60 ఏళ్లు ఆగాలి.. ఎన్టీఆర్‌ చిత్రసీమలో 60 ఏళ్లు కష్టపడిన తరువాత సీఎం అయ్యారు. నేనూ చిత్రసీమ నుంచే వచ్చాను. నేను ప్రజల సమస్యలపై పోరాడుతున్నా.. కష్టపడి సీఎం అయిన ఎన్టీఆర్‌ను నీ తండ్రి చంద్రబాబు వెన్నుపొటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ఓ సటైర్ వేశారు..

Image may contain: 2 people, people smiling, people on stage and text

మొత్తానికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న స్పీచ్ ల‌తో అద‌ర‌గొడుతున్నాడు అనే చెప్పాలి..రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌తో పాటు టీడీపీ నాయకులంతా చేతకాని దద్దమ్మలని విమర్శించారు ఆయ‌న… జ‌గ‌న్ కూడా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల పై మాట మార్చారుఅని విమ‌ర్శించారు… అలాగే ఇటు కాపులకు తెలుగుదేశం గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెర‌వేర్చ‌లేదు అని ఆయ‌న అన్నారు.. మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌లు చూస్తుంటే ఇటు ఏపీలో రాజ‌కీయంగా పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్నారు అనేది తెలుస్తోంది..