జ‌న‌సేన తొలి టికెట్ ప్లాన్ అదుర్స్

379

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు ఓ సీటుని ఫైన‌ల్ చేసి అక్క‌డ అభ్య‌ర్దిని ప్ర‌క‌టించారు.. ఇంత‌కీ తెలంగాణ‌లో అని అనుకుంటున్నారా ఇంకా అంత ఆలోచ‌న చేయ‌లేదు.. ఏపీలో ముమ్ముడివ‌రం జ‌న‌సేన అభ్య‌ర్దిగా పితాని బాలకృష్ణ పేరును ఫైన‌ల్ చేశారు.. పార్టీలో ఇటీవ‌ల చేరిన ఆయ‌నకు టికెట్ కూడా వెంట‌నే ప్ర‌క‌టించారు.. దీంతో ప‌వ‌న్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన పేరు పితాని బాల‌కృష్ణ‌ది అయింది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌న్ మ్యాన్ ఆర్మీ అన‌డానికి లేదు.. ఇప్పుడు ముమ్మిడివ‌రంలో పితాని పేరు కూడా ఫైన‌ల్ చేయ‌డంతో తూగోలో ఆయ‌న కూడా జ‌న‌సేన‌కు స‌పోర్ట్ అయిన‌ట్టే.

Image result for పితాని బాలకృష్ణ

ఇక తెలుగుదేశం వైసీపీల‌కు ఇప్పుడు జ‌న‌సేన కొర‌క‌రాని కొయ్య‌గా మారింది అనే చెప్పాలి.. ఒక‌వేళ టికెట్ దక్క‌క‌పోతే వెంట‌నే ఇరు పార్టీల నుంచి జ‌నాలు పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారు.. సో రాజ‌కీయంగా పార్టీ మారిన నాయ‌కులు త‌మకు ప్ర‌త్యామ్నాయంగా జ‌న‌సేన ఉంది అనే దైర్యంతో ఉన్నారు. ఇక ప‌వ‌న్ పార్టీలో చేరిన రోజున చెప్ప‌మ‌న్నా ఫైన‌ల్ గా టికెట్ నీకే అనేలా చెప్పేలా ఉన్నారు నేత‌లు. ఇక ఇలాంటి స‌మ‌యంలో పార్టీ త‌ర‌పున నేత‌లు చేరిన వెంట‌నే ప‌వ‌న్ మ‌రో విష‌యం ఆలోచించ‌కుండా వారికి టికెట్ ఫైన‌ల్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది.

Image result for పితాని బాలకృష్ణ

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు రాయ‌ల‌సీమ‌లో ఫోకస్ చేయ‌నున్నారు.. అలాగే ఉత్త‌రాంధ్రాలో కూడా పార్టీలో కీల‌క నాయ‌కుల చేరిక‌లు ఉంటాయి అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న కూడా నాయ‌కుల‌కు టిక్కెట్లు ఇవ్వాలి అని భావిస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ కు ఇది మ‌రింత మైలేజ్ తెచ్చే అంశం అనే చెప్పాలి… ఇక జ‌న‌సేన అభిమానులు కూడా పార్టీలో తాజా చేరిక‌ల‌తో, జోష్ మీద ఉన్నారు. .