టీడీపీకి గోదావ‌రి కౌంట‌ర్లు ఇస్తున్న ప‌వ‌న్

422

ప‌శ్చిమ‌గోదావరి జిల్లాలో బిజీ బిజీగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ … గోదావ‌రి ఎలా ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తుందో ప‌వ‌న్ మాటలు కూడా ఇప్పుడు గోదావ‌రి జిల్లాల్లో అలాగే ఉన్నాయి.. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా టీడీపీ పై విమ‌ర్శ‌ల బాణాలు వ‌దులుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్….రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి, చట్టానికి అతీతులుగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు..

Image may contain: 1 person

ఇక తెలుగుదేశం నాయ‌కులు త‌మ ఇష్టారాజ్యంగా ప‌రిపాల‌న చేస్తున్నారు? ఎవ‌రూ వారిని అడ‌గ‌రు అని అనుకుంటున్నారు. అని విమ‌ర్శ‌లు చేశారు ఆయ‌న‌…. అలాగే అధికార తెలుగుదేశం పార్టీ పై, నాయ‌కుల‌పై భీమ‌వ‌రం, న‌ర‌సాపురం, పాల‌కొల్లు, త‌ణుకు ఇలా మెయిన్ సెగ్మెంట్ల‌లో విమ‌ర్శ‌లు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్..రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి, చట్టానికి అతీతులుగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు..

Image may contain: 1 person, crowd and outdoorటీడీపీకి జిల్లాలో 15 సీట్లకు 15 సీట్లను అప్పగిస్తే ఇక్కడి ఎమ్మెల్యేలు మాత్రం అధికారులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు… ఇక మంత్రి లోకేష్ ని కూడా ఆయ‌న టార్గెట్ చేశారు.. రాష్ట్రాన్ని మేము అభివృద్ది చేశాము అని సీఎం చంద్ర‌బాబు మంత్రి నారా లోకేష్ చెప్పుకుంటున్నారు అని విమ‌ర్శించారు..లోకేశ్‌కు మంత్రి పదవి ఇచ్చి.. రాష్ట్ర యువతకు ఉద్యోగాలిచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.Image may contain: 2 people, crowd, basketball court and outdoorగోదావ‌రి జిల్లాల్లో నీటి స‌మ‌స్య అంటే అంద‌రూ ఆశ్య‌ర్య‌పోతున్నారు నిరంత‌రం ప్ర‌వ‌హించే గోదావ‌రి జిల్లాల‌కు నీటి స‌మ‌స్య తీర్చ‌డంలో తెలుగుదేశం ఫెయిల్ అయింది అని అన్నారు ఆయ‌న‌…ఇక సీఎం చంద్ర‌బాబు ఆయ‌న మ‌నువ‌డి సంర‌క్షణ మాత్ర‌మే చూస్తున్నారు అని …. చంద్ర‌బాబు రాష్ట్రంలో చిన్నారుల స‌మ‌స్య‌లు ఎలా చూస్తారు అని ప్ర‌శ్నించారు. మొత్తానికి తెలుగుదేశం పై విమ‌ర్శ‌ల బాణాలు వ‌ద‌ల‌డంలో ప‌వ‌న్ మ‌రింత చురుకు అవుతున్నారు అన‌డంలో సందేహం లేదు.