పవన్ కళ్యాణ్ కెసిఆర్ ని కలవడానికి అసలు కారణం ఇదే…కత్తి బయటపెట్టిన షాకింగ్ నిజాలు

759

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం కలిసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను పవన్ కలవడంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే తెలంగాణ సీఎంను తాను కలిశానని పవన్ కల్యాణ్ చెబుతున్నా, ఈ భేటీ వెనుక ఏదో ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కావాలంటే ఈ వీడియో చూడండి

ఇక ఇదే నేపధ్యం లో పవన్‌ కళ్యాణ్‌,తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడంపై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి తనదైన శైలిలో స్పందించారు.
`బిగ్‌బాస్‌` షోతో జ‌నాల‌కు ప‌రిచ‌య‌మైన సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో వివాదం కార‌ణంగా సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వరుస పోస్టులతో విమర్శలు చేశారు.

తెలంగాణాలో 24 గంటల పవర్ ఎలా వస్తోందో తెలుసుకున్న పవర్ స్టార్…అబ్బా!!! పవర్ సర్ప్లస్ ఉంటే వస్తుంది. లేదా వేరే స్టేట్ నుంచి కొనుక్కుంటే వస్తుంది. లేదా ఆంధ్రప్రదేశ్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టులో భాగం అయితే ఉంటుంది. దీనికి ఒక పాలసీ స్టడీ. సరేగానీ, అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్ ! అని సెటైర్‌ వేశారు.

తెలంగాణాలో నా బలం నాకుంది అని పవన్ కళ్యాణ్ అంటే నిజమే నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లో 50% ఉంటుంది. ముఖ్యంగా హైప్ చేసి హైదరాబాద్ లో ప్రీమియర్ల పెడితే టికెట్టుకి 3,000 నుంచీ 5,000 లాగొచ్చు. అంత బలం ఉంది. ఆ బలానికి బలగం తోడు అవ్వాలంటే, కె.సి.ఆర్ అనుగ్రహం కావాలి. భేష్!!! అని మహేశ్‌ కత్తి ఆరోపించారు.

అలాగే, ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌డిగాపులు. ముఖ్య‌మంత్రికి విషెస్ చెప్ప‌డానికా? అజ్ఞాత‌వాసి ప్రీమియ‌ర్ల‌కు ప‌ర్మిష‌న్ కా` అని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశాడు. అలాగే `అజ్ఞాత‌వాసి ప్రీమియ‌ర్ షోస్ ఎన్ని ప‌డ‌తాయో చెప్పు బ్ర‌ద‌ర్ ఆఫ్ మెగాస్టార్‌` అని మ‌రో కామెంట్ చేశాడు. దీంతో ప‌వ‌న్ అభిమానులు క‌త్తి వ్యాఖ్య‌ల‌పై విరుచుకుపడుతున్నారు.

ఇక ఇది ఇలా ఉంటె ఈ భేటీపై వివాదాల వర్మ తనదైన శైలిలో స్పందించాడు. గతంలో పవన్, కేసీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని మరోసారి తెరమీదకు తెచ్చి దీనికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాడు. తనదైన స్టయిల్లో ఫేస్‌బుక్ పోస్ట్ చేసి కాకరేపాడు. గత చరిత్రను తిరగేశాడు.

గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను.. పవన్‌పై కేసీఆర్ వేసిన సెటైర్లను గుర్తు చేస్తూ రాజకీయాలంటే ఇలానే ఉంటాయని చెప్పకనే చెప్పాడు. ఓ సభలో పవన్ మాట్లాడుతూ ‘ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా’ అనగా, ‘ఆడి పేరేందిరా బై’ అని కేసీఆర్ ఓ బహిరంగ సభలో అడుగుతూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలను యథాతథంగా పోస్టు చేసి.. అవసరం, సమయం రాజకీయ నాయకులను మార్చేస్తుందని, ‘జై రాజకీయ నాయకుల్లారా..’ అంటూ కేసీఆర్‌కి పవన్ శుభాకాంక్షలు చెబుతున్న ఫొటోను పోస్టు చేశాడు.

కేసీఆర్‌తో భేటీ సందర్భంగా అనేక అంశాలపై పవన్ చర్చించినట్లు సమాచారం. పరిపాలన, రాజకీయ అంశాలతోపాటు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల గురించి కూడా చర్చించినట్లు భోగట్టా. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేయడం అద్భుతమని, సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని పవన్ ఈ సందర్భంగా ప్రశంసించారు.