ఈ విష‌యంలో చురుకైన ప‌వ‌న్ క‌ల్యాణ్

7689

గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేనాని పర్య‌ట‌న‌లో జ‌న‌సేన కేడ‌ర్ కు ఉత్సాహం ఎంత వచ్చిందో… జ‌న‌సేనానికి కూడా అంతే ఉత్సాహం వ‌చ్చింది…తెలుగుదేశం పై విమ‌ర్శ‌ల అస్త్రాలు వ‌దులుతున్నారు.. అలాగే ఈ జిల్లాలో 15 సెగ్మెంట్లకి 15 సెగ్మెంట్లు విజ‌యం ఇచ్చిన ప్ర‌జ‌ల‌ను తెలుగుదేశం ప‌ట్టించుకోవ‌డం లేదు అనేలా ప‌వ‌న్ విరుచుకుప‌డుతున్నారు.. మొత్తానికి ఉత్త‌రాంధ్రా ప‌ర్య‌ట‌న త‌ర్వాత గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌తో ప‌వ‌న్ ఓ స‌రికొత్త రాజ‌కీయం చేస్తున్నారు..

Image may contain: 5 people, crowd and outdoor

ముఖ్యంగా కాపు సామాజిక‌వర్గాన్ని త‌న‌కు ద‌గ్గ‌ర చేసుకునేందుకు కూడా ఆయ‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు అని అనిపిస్తుంది మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు ప‌వ‌న్.. ఇటు వైసీపీ ప‌వ‌న్ ని విమ‌ర్శించ‌దు, జ‌గ‌న్ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌రు అని తెలుగుదేశం ప్ర‌చారం కూడా చేసింది… అయితే గ‌త కొద్దిరోజుల క్రితం జ‌గ‌న్ ప‌వ‌న్ పై బ‌హుభార్య‌త్వం పై కామెంట్లు చేశారు. దీంతో జ‌గ‌న్ ప‌వ‌న్ మ‌ధ్య రిలేషన్ లేదు అనేది తేలిపోయింది.

Image may contain: 5 people, people smiling, wedding, crowd, tree and outdoor

అయితే ప‌వ‌న్ మాత్రం 15 సెగ్మెంట్లు ప‌శ్చిమ‌లో ఉన్నాయి కాబ‌ట్టి వీటిని టార్గెట్ గా పెట్టుకున్నారు… గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను తెలుగుదేశానికి స‌పోర్ట్ గా ఉన్నాను కాబ‌ట్టే , చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌లో విజ‌యం వ‌చ్చింద‌ని… ఇప్పుడు ఆ లెవ‌ల్ మార్చాలి అని ఆయ‌న భావిస్తున్నారు… తాజాగా తెలుగుదేశం పై ఆయ‌న చేసే కామెంట్లు చూస్తుంటేనే తెలుస్తోంది… న‌ర‌సాపురం, పాల‌కొల్లు, భీమ‌వ‌రం, తణుకు, తాడేప‌ల్లిగూడెం, ప్రాంతాలు కాపు సెగ్మెంట్లుగా ఇప్ప‌టికే బ‌లంగా ఉన్నాయి… అందుకే వీటిపై జ‌న‌సేనాని ఫోక‌స్ చేస్తున్నారు అని జ‌న‌సేన నాయ‌కులు అంటున్నారు.